పదహారేళ్ల వయసులో మొదటిసారిగా ఆ అనుభవం.. అసలు గుట్టు విప్పిన రేణూ దేశాయ్

రేణూ దేశాయ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక రేణూ దేశాయ్ నిత్యం వార్తల్లో నిలుస్తూవస్తోంది. పిల్లలిద్దరిని (ఆద్య,అకీరా) పెంచుతూ వస్తోన్న రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. రచయిత, కవయిత్రి అయిన రేణూ దేశాయ్ కవితలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. రేణూ దేశాయ్ పోయెట్రి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ తాజాగా ఓ పోస్ట్ చేసింది.

సోషల్ మీడియాలో రచ్చ..

సోషల్ మీడియాలో రచ్చ..

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నెగెటివ్ కామెంట్లకు ఎంత ధీటుగా బదులిస్తుందో అందరికీ తెలిసిందే. ఇక ఆద్య, అకీరా విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుతూ తన అభిమానులకు ఖుషీ చేస్తుంది. ప్రతీ రోజూ రేణూ దేశాయ్ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

ప్రస్తుతం అలా..

ప్రస్తుతం అలా..

రేణూ దేశాయ్ ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. రెగ్యులర్‌గా వర్కౌట్లు చేస్తూ బిజీగా ఉంటోంది. ఇక ఆ మధ్య అదిరిపోయే ఫోట్ షూట్‌లతో దుమ్ములేపింది. కెమెరా స్టాండ్ ట్రైపాడ్‌ను పట్టుకుని గన్‌లా బిల్డప్ ఇస్తూ చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అయింది. తాజాగా తన మొదటి ఫోటో షూట్ వివరాలను తెలిపింది.

 పదహారేళ్ల వయసులో..

పదహారేళ్ల వయసులో..

1995 సెప్టెంబర్ 9, నేను కెమెరాను ఫేస్ చేసి ఇప్పటికి 25 ఏళ్లు గడిచాయి. మామూలుగా అయితే చిన్నప్పటి నుంచి స్పేస్ సైంటిస్ట్ లేదా న్యూరో సర్జన్ అవుదామని కలలు కన్నాను. నాకు వచ్చే మార్క్స్ కూడా అదే రేంజ్‌లో ఉండేవి. కానీ విధి అనేది ఒకటి ఉంటుంది. అదేం చేయాలని ఫిక్స్ అవుతుందో అదే చేస్తుంది. ఊహించని మలుపులను తిప్పుతుంది. దాని ప్లాన్స్ దానికి ఉంటాయి. నేను అనుకోకుండా నా పదహారేళ్ల వయసులో కెమెరాను ఫేస్ చేశాను. ఇక అప్పుడు ఫిల్మ్ మేకింగ్ ప్రేమలో పడిపోయాను. ఇక అప్పటి నుంచి జరిగిందంతా మీకు తెలిసిందే అంటూ రేణూ దేశాయ్ పాత విషయాలను గుర్తుకు తెచ్చుకుంది.

Recommended Video

Mega Fans And Super Star Fans Waiting For Gautham & Akira Nandan Entry
ఆ బాధ ఎంతో వెంటాడింది...

ఆ బాధ ఎంతో వెంటాడింది...

నాసాలో చేరాలని, స్పేస్ సైంటిస్ట్ అవ్వాలన్న కోరికను ఆ వయసులో పక్కనపెట్టడం ఎంతో బాధగా అనిపించింది. ఆ బాధ నన్ను ఎన్నో యేళ్లు వెంటాడింది. ఇక ఫిల్మ్ మేకింగ్‌పై పెరిగిన నా ప్రేమతో.. ఫిజిక్స్, గణితంపై ఉన్న ప్రేమ శాంతించింది. దర్శకుడిగా కూడా నేను స్టార్స్‌నే డీల్ చేస్తాను. కాకపోతే కాస్త భిన్నంగా ఉంటాయి. మీ మనసును మీరు నమ్మండి.. కష్టపడండి.. మీకు కచ్చితంగా విజయం సమకూరుతుందని నేను గ్యారెంటీ ఇస్తున్నాను. అంటూ తన మొదటి ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X