నాకు అలాంటివే ఇష్టం.. రేణూ దేశాయ్ కామెంట్స్ వైరల్
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన వ్యక్తిగత విషయాల గురించే కాకుండా.. సమాజంలోని సమస్యలపై స్పందిస్తూ ఉంటుంది. అన్యాయాలపై గొంతెత్తుంది. తనపై వచ్చే తప్పుడు వార్తలపై మరింతగా ఫైర్ అవుతూ ఉంటుంది. గతంలో తనపై వచ్చిన ఫేక్ న్యూస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రేణూ దేశాయ్ ప్రస్తుతం కాశీలో ఉంది.
రేణూ దేశాయ్‌ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారికి ఈ విషయం తెలిసే ఉంటుంది. కాశీ యాత్రను అందరికీ లైవ్‌లోనూ చూపిస్తూ అక్కడి విశిష్టతలను అందరికీ చెబుతోంది. అంతే కాకుండా జరిగే పూజలు, ప్రధాన ఘటికలను, గంగామాతను చూపిస్తూ అందరికీ పుణ్యాన్ని ప్రసాదిస్తోంది. ఇక కాసేపటి క్రితమే లైవ్‌లోకి వచ్చిన రేణూ దేశాయ్ అనేక విషయాలను మాట్లాడింది. లైవ్‌లో నెగెటివ్ కామెంట్లు రావడంతో కాస్త సెటైర్లు కూడా వేసింది.

తనకు ఇలాంటి దర్శనీయ ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలంటేనే ఎంతో ఇష్టమని రేణూదేశాయ్ చెప్పుకొచ్చింది. షాపింగ్ మాల్, బయట తిరగడం కంటే ఇలా చోటకు రావడంలోనే సంతోషం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక లైవ్‌లో అలా రావడంతో ఏజ్ ఎక్కువ అయినట్టుంది.. ముసల్దానిలా కనిపిస్తున్నావ్ అంటూ కొందరు కామెంట్లు చేశారు. ఏజ్ అయిపోతుంటే ఇంకెలా కనిపిస్తారని రేణూ దేశాయ్ కౌంటర్ వేసింది.


Click it and Unblock the Notifications











