ఆ పని ప్రభుత్వమే చేస్తుందని ఆశ పడుతున్నా.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుంటుందో అందరికీ తెలిసిందే. సమాజంలో జరిగే తప్పులను, అన్యాయాలను ఎండగడుతుంది. మహిళలపై జరిగే అఘాయిత్యాలను నిలదీస్తూ ప్రభుత్వాలపై ఫైర్ అవుతుంటుంది. పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలే కాకుండా ఇలా అన్ని సమస్యలపైనా స్పందిస్తుంటుంది. తాజాగా రేణూ దేశాయ్ మరో సమస్యపై స్పందించింది.

సోషల్ మీడియాలో అలా..
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసే కవితలు, చెప్పే మాటలు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. ఎంతో లోతైన భావాలను కవితల రూపంలో రేణూ దేశాయ్ చెబుతూ ఉంటుంది. కవిగా, రయిచతగా, దర్శకురాలిగా రేణూ దేశాయ్ తన ప్రతిభను చూపిస్తుంటుంది.

దైవ భక్తి కూడా...
ఈ మధ్యే రేణూ దేశాయ్ కాశీ యాత్రకు వెళ్లింది. అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ అందరికీ లైవ్‌లో చూపించింది. గంగామాత, ఘటికలను చూపిస్తూ హారతి అంటూ అన్నింటిని చూపించింది. తనకు ఇలాంటి దైవదర్శనీయ స్థలాలంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది.

సమస్యలపై ఫైర్..
సమాజంలో స్త్రీలు, బాలికలు, మహిళలపై జరిగే అత్యాచారాలపై రేణూ దేశాయ్ స్పందిస్తుంటుంది. ఆ అఘాయిత్యాలపై రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలను కూడా ఖండిస్తుంటుంది. ఆ మధ్య స్త్రీల వస్త్రాదారణపై రాజకీయ నాయకులు చేసిన కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రకృతిపై..
రేణూ దేశాయ్ ప్రకృతికి జరిగే నష్టాలను వివరిస్తూ పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది. ఆ మధ్య చెట్లను నరికేసి భవంతుల నిర్మాణాలు చెపుడుతున్నారని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. వాతవరణంలోని మార్పులు, కాలుష్యం వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ పోస్ట్‌లు చేస్తుంది.
Recommended Video

తాజాగా అలా..
అయితే రేణూ దేశాయ్ తాజాగా ప్లాస్టిక్ వాడకంపై ఫైర్ అయింది. సముద్రాలు, గంగానది, ఇలా ఎక్కడ చూసినా నీళ్లలో ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాటిపై రేణూ దేశాయ్ స్పందించింది. ఇక ప్రభుత్వాలే వాటంతట అవి ప్లాస్టిక్ తయారినీ ఆపేస్తాయని నేను ఆశపడుతున్నానంటూ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











