అది మానడం కష్టమే కానీ.. రేణూ దేశాయ్ వీడియో వైరల్
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సామాజిక సమస్యలపై స్పందిస్తూ తన గళాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. మహిళలపై జరిగే దురాగతాలను ఖండిస్తూఉంటుంది. సోషల్ మీడియా ద్వారా రేణూ దేశాయ్ తన ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు రేణూదేశాయ్‌లోని రచయిత్రి,కవయిత్రి బయటకు వస్తూ ఉంటుంది. ఆమెలో దాగి ఉన్న ఫోటోగ్రఫీ టాలెంట్ కూడా బయటకు వస్తుంది.
రేణూ దేశాయ్ ఈ మధ్యే ఫుల్ బిజీగా అయింది. బుల్లితెర షోలు, వెబ్ సీరిస్‌లు, సినిమా ప్రాజెక్ట్ అంటూ రేణూ దేశాయ్ వార్తల్లో నిలుస్తోంది. ప్యాన్ ఇండియన్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కుతోన్న ఆద్యలో నందినీ రాయ్, ధన్సిక ఇలా ఎంతో మంది స్పెషల్ రోల్స్ పోషిస్తున్నారు. తాజాగా రేణూ దేశాయ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు రేణూ దేశాయ్ విడుదల చేసిన వీడియో వైరల్అవుతోంది.

దీపావళి పండుగ శుభాకాంక్షలు. అందరూ సురక్షితంగా పండుగను జరుపుకోండి.. క్రాకర్స్ మొత్తానికే కాల్చొద్దని నేను చెప్పను. అది మానడం కష్టమే. ఎందుకంటే మన సంప్రదాయంలో క్రాకర్స్ కాల్చడం అనేది లీనమైఉంది. కానీ వీలైనంత తక్కువ కాల్చేందుకు ప్రయత్నించండి.. శబ్ద కాలుష్యం, వాతావరణ కాలుష్యాన్ని కొంతైనా తగ్గించండి.. అంటూ రేణూ దేశాయ్ తెలుగులో మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











