రేణూ దేశాయ్ మీద ఫోకస్.. చేయలేందండి జరిగిపోయిందలా అంటూ జానీ మాస్టర్ వివరణ!!
రేణూ దేశాయ్ బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. అసలు ఇప్పుడు రేణూ దేశాయ్ డైరెక్టన్, వెబ్ సిరీస్ అంటూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ చూస్తుంటే బుల్లితెరపై మరో షో తో సందడి చేసేందుకు రెడీ సిద్దమవుతోన్నట్టు తెలుస్తోంది. ఇందులో జానీ మాస్టర్, యాంకర్ రవి వంటి వారుకూడా ఉన్నట్టు కనిపిస్తోంది.

బిజీబిజీగా..
రేణూ దేశాయ్ ప్రస్తుతం ఫుల్ బిజీ అవుతోంది. తన రైతు సినిమా కోసం ఓ వైపు పనులు చేసుకుంటూనే మరో వైపు యాక్టింగ్‌లోనూ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మధ్యే ఓ వెబ్ సిరీస్‌కు సైన్ చేసిన విషయాన్ని ఎంతో సంబరంగా చెప్పింది. కొత్తగా ఉంటుంది, అందర్నీ అలరిస్తుందని రేణూ దేశాయ్ ఎంతో సంతోషంగా చెప్పింది.

తాజా ఘటనపై..
సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ సమాజంలోని చెడును ప్రశ్నిస్తుంటుంది. తాజాగా హథ్రస్ ఘటనపైనా రేణూ దేశాయ్ స్పందించింది. మనీషా వాల్మికీ ఘటనపై మీడియా ప్రర్తించిన తీరుపైనా రేణు దేశాయ్ ఫైర్ అయింది. మళ్లీ ఓ రెండు మూడు రోజులు మాట్లాడతారు తరువాత సైలెంట్ అవుతారు.. మళ్లీ ఇలాంటి జరిగినప్పుడు మేల్కొంటారంటూ రాజకీయ నాయకులను కూడా విమర్శించింది.

నిశ్శబ్దంపై రివ్యూ..
నిశ్శబ్దం సినిమాను చూశానని తెలిపింది. నిన్న రాత్రే ప్రివ్యూలో చూసే చాన్స్ వచ్చిందని చెబుతూ రేణూ దేశాయ్ తన అభిప్రాయాన్ని చెప్పింది. సినిమా బాగుందని, అనుష్క, మాధవన్ అద్భుతంగా నటించారని కితాబిచ్చింది. సస్పెన్స్‌లు అదిరిపోయాయని తెలిపింది.
Recommended Video

తాజాగా ఓ షూటింగ్‌లో..
తాజాగా రేణూ దేశాయ్ ఓ బుల్లితెర షూటింగ్‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్‌లో యాంకర్ రవి, జానీ మాస్టర్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే జానీ మాస్టర్ మాత్రం రేణూ దేశాయ్‌తో ఓ సెల్పీ దిగాడు. అందులో రేణూ దేశాయ్‌పై కాస్త ఫోకస్ తగ్గినట్టుంది. ఇదే విషయాన్ని చెబుతూ.. జానీ మాస్టర్ ఫోకస్ చేశాడు అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. చేయలేదండి.. అలా జరిగిపోయిందంటూ జానీ మాస్టర్ అమాయకంగా వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











