Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రేణూ దేశాయ్ మంచి మనసుకిదే నిదర్శనం.. అందుకోసం ఏకంగా కత్తిరించేసుకుంది!
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. కవితలు, ఫోటోలు, వెకేషన్స్, పర్సనల్ విశేషాలు, పెట్స్, పిల్లలు ఇలా ప్రతీ ఒక్క అంశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇక స్పెషల్‌గా ఆద్య, అకీరా నందన్ల విషయాలను చెబుతు షేర్ చేసే ఫోటోలు మరింతగా వైరల్ అవుతుంటాయి. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేసే రేణూ దేశాయ్ తాజాగా తాను చేసిన ఓ పని గురించి చెప్పుకొచ్చింది. రేణూ దేశాయ్ చేసిన పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సోషల్ మీడియాలో రచ్చ..
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నెగెటివ్ కామెంట్లకు ఎంత ధీటుగా బదులిస్తుందో అందరికీ తెలిసిందే. ఇక ఆద్య, అకీరా విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుతూ తన అభిమానులకు ఖుషీ చేస్తుంది. ప్రతీ రోజూ రేణూ దేశాయ్ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది.
ఫోటోషూట్లతో హల్చల్..
ఈ మధ్య రేణూ దేశాయ్ ఫోటో షూట్లతో నానా రచ్చ చేస్తోంది. యంగ్ హీరోయిన్లా ఉన్న రేణూ దేశాయ్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కెమెరా స్టాండ్ ట్రైపాడ్‌ను పట్టుకుని గన్లా బిల్డప్ ఇస్తూ చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అయింది. కెమెరాను ఫేస్ చేసిన తన మొదటి అనుభవం గురించి తాజాగా చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.
ప్రేమలో పడిపోయాను..
నేను అనుకోకుండా నా పదహారేళ్ల వయసులో కెమెరాను ఫేస్ చేశాను. ఇక అప్పుడు ఫిల్మ్ మేకింగ్ ప్రేమలో పడిపోయాను. చిన్నప్పటి నుంచి స్పేస్ సైంటిస్ట్ లేదా న్యూరో సర్జన్ అవుదామని కలలు కన్నాను కానీ ఏదో జరిగిపోయిందంటూ రేణూ దేశాయ్ పాత విషయాలను గుర్తుకు తెచ్చుకుంది.
Recommended Video
జుట్టు దానం..
స్థోమత లేని క్యాన్సర్ పేషెంట్‌కి తన జుట్టును దానం చేసినట్టు రేణూ దేశాయ్ పేర్కొంది. క్యాన్సర్ పేషెంట్ కోసం నేను నా జుట్టును కట్ చేసి దానం చేశాను.. అంటూ తన కొత్త హెయిర్ స్టైల్‌ను రేణూ దేశాయ్ షేర్ చేసింది. జట్టును దానం చేయండి.. క్యాన్సర్ పేషెంట్స్ కోసం జుట్టును దానం చేయండి అంటూ రేణూ దేశాయ్ అందరినీ కోరింది. గతంలోనూ రేణూ దేశాయ్ ఇలా తన జుట్టును దానం చేసింది.