రేణూ దేశాయ్ కూడా అలాంటిదేనా?.. స్టార్ సెలెబ్రిటీ అయినా వాటిపై మోజు!!
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా వారు కూడా సాధారణ మనుషులే. వారికి కూడా అందరికీ ఉండే కోరికలు, ఆలోచనలు, ఆప్యాయతలు, అభిమానాలుంటాయి. కాకపోతే వారిని మనం చూసే విధానం వల్లే ప్రత్యేకంగా కనిపిస్తారు. వారికి కూడా రోడ్డు పక్కన అమ్మే వేడి వేడి మిర్చి బజ్జీలు తినాలని అనిపిస్తుంది, ఆక అమ్మాయిలు ఎంతో ఇష్టంగా తినే పానీ పూరిని తినాలనిపించవచ్చు. ఇలాంటి కోరికలు స్టార్ సెలెబ్రిటీలకు రావడం కామనే. తాజాగా రేణూ దేశాయ్ తన మనసులోని కోరికను బయట పెట్టింది.

అకీరా, ఆద్యల గురించి..
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లో ఎక్కువగా అకీరా నందన్, ఆద్యల గురించే ఉంటుంది. పైగా ఆద్యలోని ప్రతిభను ఇప్పుడే మెరుగు పరుస్తోంది. రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోల్లో దాదాపు ఆద్య తీసినవే ఉంటాయట. ఎప్పుడూ కెమెరా పట్టుకుని క్లిక్‌మనిపిస్తుందట.

పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా..
రేణూ దేశాయ్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఆ మధ్య ఓ షోకు జడ్జ్‌గా వచ్చి మెప్పించింది. రైతుల మీద ఓ సినిమాను తీసేందుకు పనులు మొదలుపెట్టింది. ఆ మధ్య వికారాబాద్ చుట్టూ కొన్ని లొకేషన్లను కూడా వెతికింది. ప్రస్తుతం ఓ కామెడీ సీరియల్‌లో నటిస్తోంది. లాక్ డౌన్‌లో తగినన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌లో పాల్గొంటోంది.

పానీ పూరి, పిజ్జాలంటే ఇష్టం..
రేణూ దేశాయ్ తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. కొన్ని పదార్థాల పేరు వింటే వెంటనే ఫేస్, లుక్కు మారిపోతుందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. ‘ఎవరైనా పానీ పూరి, పిజ్జాల గురించి చెబుతూ ఉండగా నేను వింటే నా ఎక్స్‌ప్రెషన్ మారిపోతుంద'ని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. సాధారణ జనాలకు మళ్లే రేణూ దేశాయ్‌కి కూడా వీటిపై మోజు ఉందా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











