ఆ విషయాన్ని బయటపెట్టేసిందే!!..రేణూ దేశాయ్ తెలిసి చేసిందా? తెలియక చేసిందా?

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి కవితలు రాస్తూ.. ఇంకోసారి అందమైన అద్భుత చిత్రాలను తన కెమెరాలో బంధిస్తూ తనలోని టాలెంట్‌ను ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్, కెమెరా వర్క్, రచయిత, దర్శకురాలిగా ఇలా రేణూ దేశాయ్‌లో విభిన్న కోణాలున్నాయి. సమయానికి తగ్గట్టు తనలోని ప్రతిభను బయటకు తీస్తూ ఉంటుంది.

ఫోటోగ్రఫీ అంటే పిచ్చి..

ఫోటోగ్రఫీ అంటే పిచ్చి..

రేణూ దేశాయ్, ఆద్యలకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. కెమెరా చేతిలో పడితే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్స్ కూడా పనికి రారేమోనన్నంతగా దుమ్ములేపుతారు. అయితే వారద్దరూ ఐ ఫోన్‌లోనే అద్భుతమైన చిత్రాలను నెటిజన్లు ఆకర్షిస్తుంటారు. రేణూ దేశాయ్, ఆద్యలు ఇద్దరూ ఫోటోలు తీయడంలో ముందుంటారు.

ఫోటోషూట్లతో హల్చల్..

ఫోటోషూట్లతో హల్చల్..

లాక్ డౌన్ తరువాత రేణూ దేశాయ్ ఫోటో షూట్లతో రచ్చ చేసింది. బద్రీ నాటి లుక్కులోకి మారి చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అయింది. ఇద్దరు పిల్లల తల్లైనా యంగ్ హీరోయిన్‌లా ఉన్న రేణూ దేశాయ్‌ ఫోటోలను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఇక రేణూ దేశాయ్ షేర్ చేసే ఫోటోల్లో దాదాపు ఆద్య క్లిక్‌మనిపించినవే ఉంటాయట.

మొదటిసారిగా ఆ వయసులో..

మొదటిసారిగా ఆ వయసులో..


తాను అనుకోకుండా పదహారేళ్ల వయసులో మొదటగా కెమెరాను ఫేస్ చేశానని తెలిపింది. ఇక అప్పటి నుంచి ఫిల్మ్ మేకింగ్ ప్రేమలో పడిపోయానని పేర్కొంది. చిన్నప్పటి నుంచి స్పేస్ సైంటిస్ట్ లేదా న్యూరో సర్జన్ అవుదామని కలలు కన్న రేణూదేశాయ్ అలా సినిమా రంగంలోకి వచ్చేసిందట.

Recommended Video

Mega Fans And Super Star Fans Waiting For Gautham & Akira Nandan Entry
వయసును బయటపెట్టేసింది..

వయసును బయటపెట్టేసింది..


సాధారణంగా మహిళలు వయసు, బరువు, ఎత్తు వంటి వ్యక్తిగత విషయాలను చెప్పడానికి అంతగా ఇష్టపడరు. కానీ రేణూ దేశాయ్ ఓ ఫోటోను షేర్ చేస్తూ.. తన 39 ఏళ్ల జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని తన వయసును చెప్పకనే చెప్పేసింది. నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో కారు మబ్బులు కమ్మడం, జోరుగా వానలు కురవడంతో వాతావరణం మొత్తం మారింది. సాయంత్రం ఆరు గంటలకు తీసిన ఫోటో అంటూ ఓ పిక్‌ను షేర్ చేసింది. అయితే తన వయసు గురించి చెప్పాలని చెప్పిందో.. లేక ఆ ఎగ్జైట్మెంట్‌లో చెప్పేసిందో మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X