డ్రగ్స్ కేసుపై ఉన్న శ్రద్ద వాటిపై ఉండదు.. మీడియాపై రేణూ దేశాయ్ సెటైర్స్

మన దేశంలో అత్యాచారం జరగని రోజు, వాటికి సంబంధించిన వార్తలు వినని రోజూ అసలే ఉండదు. అయితే కొన్నిసార్లు అవి మీడియాలో బాగా ఫోకస్ అవుతుంటాయి. ఇంకొన్ని సార్లు అలాంటి వార్తలు మరుగున పడుతుంటాయి. అయితే మన దేశ మీడియాలో గత కొన్ని నెలలుగా సుశాంత్ సింగ్ కేసు, డ్రగ్స్, రియా చక్రవర్తి చుట్టే తిరుగుతోంది. ఓ అమ్మాయిపై దారుణంగా అత్యాచారం చేసి, చంపేస్తే మీడియా అంతగా ఫోకస్ పెట్టలేదు. ఇక ఈ విషయంపై నెటిజన్లు మీడియాపై సెటైర్లు వేస్తున్నారు.

అతి దారుణంగా..

అతి దారుణంగా..

పందొమ్మిదేళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరగడం, ఆపై ఆమెను దారుణంగా చంపిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనను మీడియా అంతగా పట్టించుకోకపోవడం, బాధితురాలి కుటుంబానికి అండగా నిలవకపోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

అదే ముఖ్యమా మీకు..

అదే ముఖ్యమా మీకు..

అయితే సుశాంత్ కేసులో అతి చొరవ చూపుతున్న జాతీయ మీడియాకు ఈ దారుణం కనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఎవరిదైనా ప్రాణమే అంటూ.. ఓ అమ్మాయిని ఇంత దారుణంగా చంపేస్తే మీడియా కనీసం కవర్ కూడా చేయడం లేదంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

సెలెబ్రిటీల మద్దతు..

సెలెబ్రిటీల మద్దతు..

మనీషా వాల్మికి న్యాయం జరగాలంటూ సెలెబ్రిటీలందరూ సోషల్ మీడియాలో ఉద్యమాన్ని ప్రారంభించారు. #JusticeForManishaValmiki అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో హోరెత్తిస్తున్నారు. ఆ అమ్మాయి మృతదేహాన్ని పోలీసులే దహనం చేయడం, తల్లిదండ్రులకు అప్పగించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Recommended Video

Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
స్పందించిన రేణూ దేశాయ్..

స్పందించిన రేణూ దేశాయ్..

గత రెండు నెలలుగా డ్రగ్స్ కేసు గురించి మీడియాలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ దేశ సాధారణ పౌరురాలికి అన్యాయం జరిగితే మాత్రం పట్టించుకోవడానికి సమయం లేదు. అయినా ఇలాంటి అత్యాచారాలు, అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల గురించి కొన్ని రోజులు చర్చిస్తారు. మళ్లీ ఇలా ఏదో ఒక ఘటన జరిగే వరకు అంతా మరిచిపోతారు. ఇక ఎప్పుడు మేల్కొనేది.. దీన్ని ఎప్పుడు సీరియస్‌గా తీసుకునేది అంటూ రేణూ దేశాయ్ అందర్నీ ప్రశ్నించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X