twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    21 years of badri: పవన్‌ కల్యాణ్‌తో బంధాన్ని గుర్తు చేసుకొన్న రేణుదేశాయ్.. అదే నాకు రక్షణ అంటూ..

    |

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బద్రీ చిత్రం టాలీవుడ్‌లో 21 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రేక్షకులు బద్రీ గురించి తమకు కలిగిన అనుభూతులను సోషల్ మీడియా ద్వారా పంచుకొంటున్నారు. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకే కాకుండా పవన్ కల్యాణ్ జీవితంలోకి ప్రవేశించిన రేణు దేశాయ్ తన జ్ఞాపకాలను ఇన్స్‌టాగ్రామ్‌లో పంచుకొన్నారు. రేణుదేశాయ్ గురించి, ఆమె జీవితంలో జరిగిన కీలక సంఘటన గురించిన వివరాలు మీకోసం..

    అర్ధనగ్నంగా హాట్ హీరోయిన్.. బికినీలో దారుణంగా స్కిన్ షో

    బద్రి ద్వారా టాలీవుడ్ ఎంట్రీ

    బద్రి ద్వారా టాలీవుడ్ ఎంట్రీ

    డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తొలి చిత్ర దర్శకుడిగా వ్యవహరిస్తూ రూపొందించిన బద్రి చిత్రం ఏప్రిల్ 20, 2000 తేదీన రిలీజ్ అయింది. ఈ చిత్రం ద్వారా పూరీతోపాటు అమీషా పటేల్, రేణు దేశాయ్ తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం పవర్ స్టార్ స్టామినాకు తగినట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.

    పవన్‌తో రేణు దేశాయ్ బంధం

    పవన్‌తో రేణు దేశాయ్ బంధం

    బద్రి సినిమా షూటింగులో పవన్ కల్యాణ్‌తో రేణుదేశాయ్‌కి ఏర్పడిన పరిచయం మరో మెట్టు ఎక్కింది. వారి పరిచయం ప్రేమగా మారి.. సహజీవనం వరకు వెళ్లింది. ఆ తర్వాత 2009 జనవరి 28వ తేదీన దంపతులుగా మారిపోయారు. అలా వారి దాంపత్య జీవితం చక్కగా సాగింది.

    రిలేషన్‌షిప్‌ బ్రేకప్

    రిలేషన్‌షిప్‌ బ్రేకప్

    పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ జీవితంలోకి ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య ప్రవేశించారు. ఆ తర్వాత సుదీర్ఘకాలం పవన్, రేణు దేశాయ్ బంధం కొనసాగింది. అయితే వారి మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో వారి రిలేషన్‌షిప్‌కు బ్రేకులు పడ్డాయి. 2012లో వారిద్దరూ విడాకులు తీసుకోవడం వారి లైఫ్ జర్నీ ముగిసింది.

    బద్రీ మూవీ షూటింగులో

    బద్రీ మూవీ షూటింగులో

    బద్రి మూవీ 21 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా రేణు దేశాయ్ ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించారు. బిహైండ్ ది షూట్ (బీటీఎస్) ఫోటోను షేర్ చేసింది. పవన్ కల్యాణ్‌తో అనుభూతులను, జ్ఞాపకాలను గుర్తు చేసుకొన్నారు. పవన్ కల్యాణ్ వేసిన ఫోటో బాంబింగ్ అంటూ ఫోటోను షేర్ చేశారు.

    నా దుపట్టానే నాకు రక్షగా

    నా దుపట్టానే నాకు రక్షగా

    బద్రిలోని హే చికితా పాట షూటింగ్ సందర్భంగా జరిగిన ఫోటో షూట్‌లో నా దుపట్టా నాకు సన్ స్రీన్‌గా మారింది. అంటూ #21yearsofbadri #myfilm #memories #memoriesforlife హ్యాష్ ట్యాగ్ షేర్ చేసింది. పవన్‌పై ఉన్న ప్రేమను, అభిమానాన్ని మరోసారి ఈ సందర్భంగా షేర్ చేసుకొన్నారు.

    English summary
    Actress Renu Desai shares Pawan Kalyan's Badri's BTS Photo goes viral. Renu Desai entered into tollywood with Badri which completes 21 years on April 20th. On this occassion, Renu Desai wrote that.. My dupatta is my version of sunscreen...photobombing happening during Chikita shoot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X