twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేటితో నలభై యేళ్లు నిండాయ్.. బంతి కాన్సెప్ట్‌తో రేణూ దేశాయ్ వెరైటీ సందేశం

    |

    రేణూ దేశాయ్ పుట్టిన రోజు నేడు (డిసెంబర్ 4). మామూలుగానే రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. కవిత్వాలు రాస్తుంది.. కొటేషన్స్ చెబుతుంది.. ఒక్క ఫోటోలోనే ఎంతో అర్థాన్ని చెబుతూ ఉంటుంది. అలాంటిది బర్త్ డే రోజున ఓ ఫిలాసఫీ చెప్పకుండా ఉంటుందా?. ఈ మధ్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంతగా రచ్చ చేస్తోందో అందరికీ తెలిసిందే. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

    ఎన్నో రకాల టాలెంట్స్..

    ఎన్నో రకాల టాలెంట్స్..

    రేణూ దేశాయ్ రచయితగా, డైరెక్టర్, క్యాస్టూమ్ డిజైనర్, కవయిత్రి, ఫోటోగ్రాఫర్ ఇలా ఎన్నో రకాల టాలెంట్స్ ఉన్నాయి. సందర్భానుసారంగా అవన్నీ బయటకు తీస్తుంటుంది. అయితే ఆ మధ్య ఎక్కువగా కవిత్వాలు రాసి నెటిజన్లు ఆకట్టుకునేది. కానీ మధ్యలో ఫోటోగ్రఫీపై ఇంట్రస్ట్ చూపించినట్టు కనిపించింది.

    అన్ లాక్ ప్రక్రియలో అలా..

    అన్ లాక్ ప్రక్రియలో అలా..

    అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక రేణూ దేశాయ్ పలు షూటింగ్‌లతో బిజీగా గడిపింది. బుల్లితెరపై వచ్చే ఎంటర్టైన్మెంట్, యూట్యూబ్‌లో వచ్చే షో కోసం రేణూ దేశాయ్ ఆ మధ్య వరుసగా బిజీగా తిరిగింది. అయితే ఆ సమయంలో పిల్లలను పవన్ కళ్యాణ్ వద్దకు పంపించానని తెలిపింది.

    అదిరిపోయే ఫోటోతో..

    అదిరిపోయే ఫోటోతో..

    అయితే రేణూ దేశాయ్ నిన్న అదిరిపోయే ఫోటోను షేర్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ ఒళ్లో అకీరా, ఆద్యలు సేదతీరారు. హాయిగా తండ్రి ఒళ్లో పడుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఆ అద్భుతమైన క్షణాన్ని తానే బంధించానని, అలాంటి ఫోటోలను ఫోన్‌లోనే దాచుకోకూడదని అందుకే షేర్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది.

    Recommended Video

    Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
    తాజాగా అలా..

    తాజాగా అలా..

    ఇక నేడు తనకు నలభై యేళ్లు నిండాయ్ అని చెబుతూ రేణూ దేశాయ్ ఓ బంతి కాన్సెప్ట్‌ను చెప్పింది. బాద్ షా సినిమాలో కాజల్ అగర్వాల్‌లా రేణూ దేశాయ్ ఓ కొటేషన్ చెప్పింది. మన మీద ఎప్పుడు ఎలాంటి బంతిని జీవితం విసురుతుందో తెలియదు.. నవ్వుతూ.. ధైర్యంగా దాన్ని తిరిగే కొట్టేసి స్టేడియం నుంచి చాంపియన్‌లా రావడమే మనం చేయాల్సిందంటూ ఎక్కడికో బయల్దేరుతున్న ఫోటోను షేర్ చేసింది.

    English summary
    Renu Desai Special Message on turn 40 age, As I turn 40 today, I am accepting and embracing the fact that life can throw a crazy curveball at us anytime. All we can do, is smile, and swing it out of the stadium like a champ.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X