ఏదో మ్యాజిక్ ఉంది.. పన్నెండో యేటనే నేర్చుకున్నాను.. మళ్లీ రేణూ దేశాయ్ కొత్త ప్రయోగం!!
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. రేణూ దేశాయో ఓ తల్లిగా దర్శకురాలి రచయిత్రిగా మహిళా సాధికారత గురించి పాటు పడుతూ విభిన్న కోణాలో తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. నిత్యం తన భావాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ప్రకృతి ప్రేమికురాలు, జంతు ప్రేమికురాలు.. ఇలా ఎన్నో రకాల పార్శ్వాలు ఆమెలో ఉన్నాయి. ఒక్కోసారి ఆకాశం, మబ్బుల గురించి చెబుతుంది. ఇంకో సారి జంతువుల గురించి చెబుతుంది.

పిల్లలతో సందడి..
రేణూ దేశాయ్‌కు తన పిల్లలతో సందడిగా గడిచిపోతూ ఉంటుంది. ఆద్య చేసే అల్లరి, అకీరా వ్యక్తిత్వం ఇలాంటి విషయాలెన్నో తన ఫాలోవర్స్‌తో చెప్పుకుంటూ ఉంటుంది. ఆద్య అల్లరి చేస్తే అకీరా మాత్రం కామ్‌గా, సైలెంట్‌గా ఉంటాడని చెబుతూ ఉంటుంది.

వ్యక్తిగత విషయాలు..
ఈ మధ్యే ఎవ్వరికీ తెలియన కొన్ని విషయాలను చెప్పింది రేణూ దేశాయ్. అసలు ఈ ఇండస్ట్రీకి రావడానికి గల కారణాలు, ఆ ఘటన గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పదహారేళ్ల వయసులో మొదటగా కెమెరాను ఫేస్ చేశానని తెలిపింది. ఇక అప్పటి నుంచి ఫిల్మ్ మేకింగ్ ప్రేమలో పడిపోయానని పేర్కొంది.

వాతావరణ మార్పులపై..
గత వారం హైద్రాబాద్‌లో వానలు కుండపోతగా కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ మేరకు మారిన వాతావరణాన్ని తన కెమెరాలో బంధించింది. ఈ మేరకు ఆ ఫోటోను షేర్ చేస్తూ.. తన 39 ఏళ్ల జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని తన వయసును చెప్పకనే చెప్పేసింది. నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో కారు మబ్బులు కమ్మడం, జోరుగా వానలు కురవడంతో వాతావరణం మొత్తం మారింది. సాయంత్రం ఆరు గంటలకు తీసిన ఫోటో అంటూ ఓ పిక్‌ను షేర్ చేసింది.

ఏదో మ్యాజిక్ ఉంది..
గుర్రాల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. నా పన్నెండో ఏటనే గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. గుర్రాలు ఎంత తెలివైనవో చురుకుగా ఉంటాయో నాకు వ్యక్తిగతంగా తెలుసు. 2015లో బరువు పెరిగిన తరువాత హార్స్ రైడింగ్ చేయడం ఆపేశాను.

బరువు తగ్గి మళ్లీ..
ప్రకృతిలోని ఈ అద్భుత సృష్టిని మళ్లీ ఎంజాయ్ చేయాలని, వాటికి నాకు ఉన్న ఆ బంధాన్ని మళ్లీ ఫీల్ అవ్వాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. త్వరగా బరువు తగ్గి మళ్లీ గుర్రం ఎక్కుతాను అంటూ రేణూ దేశాయ్ తెలిపింది. నిద్రపోయే, క్యూట్‌గా ఉండే తన గుర్రానికి రోమియో అనే పేరును పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











