మీకై నేను ప్రార్థించను.. కరోనా కోసం మొక్కుతాను.. అమితాబ్‌పై వర్మ సంచలన కామెంట్స్

సంచలనానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వర్మ.. ఎప్పుడూ వింత కామెంట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఏ విషయంలోనైనా సరే ఆయన చేసే కామెంట్లు అందర్నీ ఆకట్టుకుంటాయి. అందుకే వర్మ శైలి వేరు.. అందరిలో కెల్లా ప్రత్యేకం. తాజాగా అమితాబ్‌ బచ్చన్‌కు కరోనా సోకిందనే వార్త ఇండియాను కుదిపేస్తోండగా.. వర్మ తనదైన శైలో స్పందించాడు. ఆర్జీవీ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఆకర్షిస్తోంది.

అమితాబ్‌కు కరోనా..

అమితాబ్‌కు కరోనా..

అమితాబ్ బచ్చన్‌కు కరోనా సోకిందనే వార్త బయటకు రాగానే అంతా షాక్‌కు గురయ్యారు. తనకు కరోనా సోకిందనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తనకు, అభిషేక్‌కు కరోనా వచ్చిందని, నానావతి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నామని ప్రకటించాడు.

 బచ్చన్ ఫ్యామిలీ సేఫ్..

బచ్చన్ ఫ్యామిలీ సేఫ్..

అమితాబ్, అభిషేక్‌లకు కరోనా రావడంతో అందరూ ఆందోళనకు చెందారు. ఇక మిగిలిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటని అంతా ఆరా తీశారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు జయా బచ్చన్, ఐశ్వర్యా రాయ్, ఆరాద్యలకు కరోనా నెగెటివ్ వచ్చినట్టు తెలుస్తోంది.

కంటైన్మెంట్ జోన్..

కంటైన్మెంట్ జోన్..


అమితాబ్ ఫ్యామిలీ నివసిస్తున్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై అక్కడ మరింత కఠినంగా చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం తాము క్షేమంగానే ఉన్నామని, ఎలాంటి ఆందోళన చెందకండని అమితాబ్ తమ అభిమానులకు సందేశం పంపాడు.

వర్మ వెరైటీ రియాక్షన్..

వర్మ వెరైటీ రియాక్షన్..

అమితాబ్‌కు కరోనా సోకిందనే వార్త తెలుసుకున్న వర్మ.. సోషల్ మీడియాలో వెరైటీగా స్పందించాడు. ప్రతీ విషయంలోనూ వర్మ అలాగే రియాక్ట్ అవుతాడని అందరికీ తెలిసినా.. ఈ సారి మరింత ప్రత్యేకంగా నిలిచాడు. అమితాబ్, కరోనాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Recommended Video

#AmitabhBachchan : Coronavirus సోకిన తరువాత మొదటిసారి మాట్లాడిన Amitabh Bachchan..!
 మీ కోసం ప్రార్థించను..

మీ కోసం ప్రార్థించను..

అమితాబ్ ఆరోగ్యంపై ఆర్జీవీ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. ‘సర్కార్.. కరోనా ** మీద తన్ని ఎప్పటిలాగే మీరు ఎంతో ఆరోగ్యంగా తిరిగి వస్తారని నాకు తెలుసు. అందుకే మీ కోసం నేను ప్రార్థించడం లేదు. కానీ నేను కరోనా కోసం మొక్కుతాను ఎందుకంటే.. మిమ్మల్ని ఇలా చేసినందుకు అతి కచ్చితంగా చచ్చిపోతుంద'ని వర్మ తన స్టైల్లో అమితాబ్ గురించి చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X