వావ్.. వావ్.. వావ్: లేడీ ఎంపీల హాట్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ

దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసిన ఓ వీడియో హాట్ టాపిక్ అయింది. బెంగాలీ హీరోయిన్లు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ ఈ వీడియోలో డాన్స్ చేస్తూ కనువిందు చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వీరు ఎంపీలుగా గెలుపొందడంపై హర్షం వ్యక్తం చేస్తూ వర్మ ఈ వీడియో షేర్ చేశారు.

ఈ ఇద్దరు నటీమణులు ఎంపీలుగా ఎన్నిక కావడంపై సంభ్రమాశ్చర్యానికి గురైన రామ్ గోపాల్ వర్మ.... ఇండియా నిజంగానే పురోగతి సాధిస్తోంది, ఈ ఇద్దరు ఎంపీలను చూస్తుంటే కనువిందుగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బెంగాళీ నటి మిమి చక్రవర్తి పశ్చిమబెంగాళ్‌లోని జాదవ్‌పూర్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ ఆమె బీజేపీ అభ్యర్థి అనుపమ్ హజ్రా మీద దాదాను 3 లక్షల ఓట్ల ఆధిక్యం సాధించారు.

మోడలింగ్ రంగానికి చెందిన మిమి చక్రవర్తి 'ఫెమినా మిస్ ఇండియా' అందాల పోటీల్లో పాల్గొన్నారు. 2012లో 'బాపి బారి జా' అనే బెంగాలీ సినిమా ద్వారా తెరంగ్రేటం చేశారు. ఇప్పటి వరకు 20కి పైగా చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన చివరి చిత్రం 'మాన్ జానే నా' మార్చి 21న విడుదలైంది. దీంతో పాటు మరో రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

 RGV tweet about New MPs from Bengal Mimi Chakraborty & Nusrat Jahaan

మరో బెంగాలీ నటి నుస్రత్ జహాన్ బసిర్‌హట్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సయంతన్ బసుపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నస్రత్ జహాన్ మూడున్నర లక్షల మెజారిటీ సాధించారు.

మోడలింగ్ రంగం నుంచి నటనవైపు వచ్చిన నుస్రత్ జహాన్ 2011లో శోత్రు అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేశారు. ఇప్పటి వరకు 19 చిత్రాల్లో నటించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X