తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
మిరపకాయ్, మిర్చి వంటి సినిమాల్లో హాట్‌గా కనిపించి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది రిచా గంగోపాధ్యాయ. అయితే అందం ఉన్నా కూడా అదృష్టం అంతగా లేకుండా పోయింది. ఎన్ని అవకాశలు వచ్చినా సరైన హిట్ రాలేదు..సరైన హిట్ వస్తే అందులో ఆమె పాత్రకు గుర్తింపు రాలేదు. ఇలా సినీ పరిశ్రమలో ఉంటూనే చివరకు మాయమైంది. తన ప్రియుడ్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.

స్నేహితుడితో..
తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను రిచా వివాహామాడింది. అయితే ఈ పెళ్లి గురించి రిచా ముందుగా ఎవ్వరికీ ఎలాంటి సమాచారం అందించలేదు. అలా సడెన్‌గా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. రిచా, జో స్కూల్‌లో బెస్ట్ ఫ్రెండ్స్. తమ చిన్ననాటి స్నేహం పెద్దయ్యాక ప్రేమగా మారిందట.

అలా గుడ్ బై..
చివరిగా రిచా 2013లో వచ్చిన 'భాయ్' సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమాలు మానేసి తన స్వస్థలమైన అమెరికా వెళ్లిపోయింది. సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సినిమాలే తన జీవితం కాదని అంతకుమించి చేయాల్సినవి చాలా ఉన్నాయని చెబుతూ వీడ్కోలు తీసుకుంది.

ఆ మధ్య అలా..
వావ్.. 'మయక్కం ఎన్నా' సినిమా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుందంటే నమ్మలేకపోతోన్నాను. నా కలలను సాకారం చేసుకునేందుకు రీల్ లైఫ్ అనే ఓ పేజీని రియల్‌లైఫ్ నుంచి తొలగించాను. జీవితంలో ఇప్పటివరకూ నాకు ఎలాంటి బాధల్లేవు. నటిగా ఉన్న సమయంలోనే మార్కెటింగ్, మేనేజ్‌మెంట్‌లో శిక్షణ తీసుకోవాలనే ఆశ కలిగింది. అందుకే సినిమాలను వదిలేశానంటూ.. రిచా తనపై ప్రేక్షకులు కురిపించిన ప్రేమకు కదిలిపోయింది.

ఇప్పుడు ఇలా..
అయితే తాజాగా రిచా ఓ గుడ్ న్యూస్‌ను చెప్పేసింది. తాను తల్లి కాబోతోన్నాని ఆనందం వ్యక్తిం చేసింది. అంతే కాకుండా జూన్‌లో పండండి బిడ్డ జన్మించబోతోందని చెబుతూ గాల్లో తేలిపోయింది. ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

జూన్‌లో పండంటి బిడ్డ..
మేము ఓ సీక్రెట్‌ను దాచి పెట్టాం.. నేను, జాయ్ ఆ విషయాన్ని చెప్పడానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నాం.. జూన్‌లో బేబీ లాంగెల్లా రాబోతోంది.. ఈ శుభవార్తతో మా హృదయం సంతోషంతో నిండిపోయింది.. మా చిట్టి పాపతో కూడిన మా జీవితంలోని సంతోషాలను చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నామని చెప్పుకొచ్చింది. మొత్తానికి జూన్‌లో రిచా పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందన్న మాట.


Click it and Unblock the Notifications











