Richest Actors: ఇండియాలో ధనిక హీరోలు వీళ్లే.. 20లో నలుగురు తెలుగోళ్లు.. 6 వేల కోట్లతో ఫస్ట్ ఎవరంటే!
Richest actors of India: ఇండియాలో సినిమా వాళ్లకు లభించే ఆదరణ మరే రంగంలోని వాళ్లకూ దక్కదు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఇక్కడ సినిమా నటీనటులను దేవుళ్లులా కొలుస్తుంటారు. ఈ కారణంగానే చాలా మంది స్టార్లు ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను, ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. అలా ఇప్పుడు భారతదేశంలో చాలా మంది హీరో, హీరోయిన్లు కోట్లకు కోట్లు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇండియాలో అత్యధిక ఆస్తులను సంపాదించుకున్న స్టార్లు ఎవరో తెలుసుకుందాం పదండి!
6 వేల కోట్లతో షారూక్ టాప్:2023వ సంవత్సరం నాటికి ఇండియాలో అత్యధిక ఆస్తులను సంపాదించుకున్న హీరోల జాబితా తాజాగా బయటకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడి ఆస్తుల విలువ మొత్తం 735 మిలియన్ డాలర్లు ఉంటుందట. అంటే ఇండియన్ కరెన్సీలో అతడి నికర విలువ మొత్తం 6128 కోట్ల రూపాయలు అని తెలిసింది.

బాలీవుడ్ హీరోలదే హవా:ఇండియాలో ధనిక నటీనటుల టాప్ 20 లిస్టులో ఎక్కువ శాతం బాలీవుడ్ స్టార్ హీరోలే ఉన్నారు. అందులో హృతిక్ రోషన్ రెండో స్థానంలో నిలిచాడు. అతడికి 410 మిలియన్ డాలర్లు (3418 కోట్లు), అమితాబ్ బచ్చన్ 375 మిలియన్ డాలర్లు (3127 కోట్లు), సల్మాన్ ఖాన్ 355 మిలియన్ డాలర్లు (2960 కోట్లు), అక్షయ్ కుమార్ 325 మిలియన్ డాలర్లు (2710 కోట్లు) టాప్ 5లో ఉన్నారు.
తెలుగులో చిరంజీవి టాప్:తాజాగా విడుదలైన రిచెస్ట్ యాక్టర్ల జాబితాలో బాలీవుడ్ హీరోలే హవాను చూపించారు. ఇందులో ఆరో స్థానంలో ఆమిర్ ఖాన్ 1959 కోట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక, మెగాస్టార్ చిరంజీవికి ఏడో స్థానం దక్కింది. ఆయన ఆస్తుల విలువ 200 మిలియన్ డాలర్లు అని తెలిసింది. అంటే ఇండియన్ కరెన్సీలో మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల మొత్తం 1667 కోట్లు రూపాయలు అని చెప్పొచ్చు.

మిగిలిన తెలుగు హీరోలు:ధనిక నటీనటుల టాప్ 20 లిస్టులో మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో ముగ్గురు తెలుగు హీరోలకు కూడా చోటు దక్కింది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 175 మిలియన్ డాలర్లు (1459 కోట్లు)తో 8వ స్థానంలో, నాగార్జున 123 మిలియన్ డాలర్లు (1025 కోట్లు)తో 10వ స్థానంలో నిలిచాడు. అలాగే, ఎన్టీఆర్ 60 మిలియన్ డాలర్లు (500 కోట్లు)తో 15వ స్థానంలో కొనసాగుతున్నాడు.
హీరోయిన్లకు కూడా చోటు:ఇండియాలో అత్యధిక ఆస్తులు ఉన్న యాక్టర్ల జాబితాలో పలువురు స్టార్ హీరోయిన్లు కూడా చోటు దక్కించుకున్నారు. అందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 75 మిలియన్ డాలర్లు (625 కోట్లు)తో 11వ స్థానంలో, హాట్ హీరోయిన్ దీపిక పదుకొనే 60 మిలియన్ డాలర్లు (500 కోట్లు)తో 14వ స్థానంలో, కరీనా కపూర్ 60 మిలియన్ డాలర్లు (500 కోట్లు)తో 16వ స్థానంలో నిలిచారు.

సౌత్ నుంచి ఇద్దరు కూడా:భారతదేశంలో అత్యధిక సంపన్నులైన సినీ నటుల్లో సౌత్ నుంచి మరో ఇద్దరు కూడా టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. అందులో ఇళయదళపతి విజయ్ 56 మిలియన్ డాలర్లు (467 కోట్లు)తో 17వ స్థానంలోనూ, సూపర్ స్టార్ రజినీకాంత్ 55 మిలియన్ డాలర్లు (458 కోట్లు)తో 18వ స్థానంలో నిలిచారు.
సంపన్న నటుల టాప్ 20:1. షారూక్ ఖాన్, 2. హృతిక్ రోషన్, 3. అమితాబ్ బచ్చన్, 4. సల్మాన్ ఖాన్, 5. అక్షయ్ కుమార్, 6. ఆమిర్ ఖాన్, 7. చిరంజీవి, 8. రామ్ చరణ్, 9. సైఫ్ అలీ ఖాన్, 10. నాగార్జున, 11. ప్రియాంక చోప్రా, 12. అనుపమ్ ఖేర్, 13. అజయ్ దేవగణ్, 14. దీపిక పదుకొనే, 15. ఎన్టీఆర్, 16. కరీనా కపూర్, 17. విజయ్, 18. రజినీకాంత్, 19. మిథున్ చక్రవర్తి, 20. నసీరుద్దిన్ షా


Click it and Unblock the Notifications











