Richest Actresses: ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్స్ వీళ్లే.. టాప్ 10లో ఒక్కరే సౌత్.. 800 కోట్లతో ఫస్ట్ ఎవరంటే!

Richest Actresses of India 2023: ఇండియాలో సినిమా రంగానికి ప్రత్యేక స్థానం ఉందనే విషయం తెలిసిందే. హీరోలు, హీరోయిన్స్ లను ప్రేక్షకులు దేవుడిలా కోలుస్తారు. ఈ కారణంగానే చాలా మంది స్టార్లు ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను, ఆదాయాన్ని వెనకేసుకుంటూ ఉంటారు. అలా ఇప్పుడు భారతదేశంలో చాలా మంది హీరో, హీరోయిన్లు కోట్లకు కోట్లు ఆస్తులు కూడ బెట్టుకుంటున్నారు. అటు ప్రేక్షకులకు ఎంటర్ టైన్ ఇస్తునే... మరోవైపు తమకు వచ్చే రెమ్యూనరేషన్స్ తో కోట్లు గడిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇండియాలో అత్యధిక ఆస్తులను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం పదండి!

2023వ సంవత్సరం నాటికి ఇండియాలో అత్యధిక ఆస్తులను సంపాదించుకున్న హీరోయిన్స్ జాబితా తాజాగా బయటకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ మొదటి స్థానంలో ఉంది. ఆమె ఆస్తుల విలువ మొత్తం 800 కోట్లు ఉంటుందని సమాచారం. ఐశ్వర్య రాయ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ.. ఆమె ఆస్తుల విలువ అంత ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

Richest Actresses of India: Aishwarya, Deepika, Anushka, Katrina, Nayanthara, Alia Bhatt Gets Placed in TOP10

ఇండియాలో ధనిక నటీనటుల టాప్ 10 లిస్టులో ఎక్కువ శాతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. అందులో ప్రియాంక చోప్రా రెండో స్థానంలో ఉంది. ఈ భామ నిక్ ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే ఈ భామ ఆస్తే.. ఏకంగా 620 కోట్లు ఉంటుందని తేలింది. అలా టాప్ హీరోయిన్స్ లో ఒకరైన ప్రియాంక.. బాగానే వెనకేసుకుందని తెలుస్తోంది.

ఆ తర్వాతి మూడో స్థానంలో దీపికా పదుకునే నిలిచింది. 500 కోట్ల రూపాయలతో మూడో స్థానంలో ఉంది. ఈ భామ రణవీర్ సింగ్ ను వివాహం ఆడిన సంగతి తెలిసిందే. ఇటీవల జవాన్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఫైటర్ అనే సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తుంది. ఇక కరీనా కపూర్ 440 కోట్ల రూపాయలతో నాలుగవ స్థానంలో ఉంది. ఈ భామ సైఫ్ అలీఖాన్ ను పెళ్లాడింది.

Richest Actresses of India: Aishwarya, Deepika, Anushka, Katrina, Nayanthara, Alia Bhatt Gets Placed in TOP10

ఐదో స్థానంలో అనుష్క శర్మ 255 కోట్లతో ముందంజలో ఉంది. ఈ భామ విరాట్ కోహ్లినీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆస్తులు కాకుండా అనుష్క ఆస్తి 255 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాతి ఆరవ స్థానంలో మాధురి దీక్షిత్ ఉంది. ఈ భామ 235 కోట్ల రూపాయలు కూడబెట్టిందని సమాచారం. ఇక ఆ తర్వాతి స్థానంలో అంటే 7వ స్థానంలో కత్రినా కైఫ్ నిలిచింది. ఈ భామ ఇటీవల టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Richest Actresses of India: Aishwarya, Deepika, Anushka, Katrina, Nayanthara, Alia Bhatt Gets Placed in TOP10

8వ స్థానంలో అలియా భట్ 229 కోట్ల రూపాయలు కూడబెట్టింది. ఈ భామ రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ స్టార్ హీరోయిన్ ఆస్తి రూ.229 కోట్లు అని తేలింది. ఇక ఆ తర్వాతి స్థానంలో శ్రద్ధా కపూర్ రూ.123 కోట్లతో 9వ స్థానంలో ఉంది. ఇక పదో స్థానంలో నయనతార 100 కోట్లతో నిలిచింది. అయితే ఈ భామ ఒక్కతే సౌత్ హీరోయిన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X