జెనీలియాకు గాయం.. ఆ పని చేసుకోలేక ఇబ్బంది.. భర్త సాయానికి నెటిజన్లు ఫిదా
బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌లు ముందు వరుసలో ఉంటారు. సినిమాతో మొదలైన ప్రేమ.. చివరకు వివాహా బంధంగా మారింది. ప్రస్తుతం పిల్లలతో వీరి జీవితం ఎంతో సాఫీగా సాగుతోంది. ఇక ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో చేసే సందడి మాత్రం అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరూ కలిసి చేసే సరసాలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. తాజాగా భార్యకు సేవలు చేసే శ్రీవారిగా రితేష్ మారిపోయాడు.

సోషల్ మీడియాలో యాక్టివ్..
జెనీలియా, రితేష్ ఇద్దరూ కూడాసోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. పర్సనల్ లైఫ్ గురించి సంబంధించిన విషయాలే ఎక్కువగా షేర్ చేస్తుంటారు. ఇక ఇద్దరూ ఎమోషనల్ అయిన సందర్భాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.

ఆ మధ్య అలా..
ఆ మధ్య జెనీలియా తమ ప్రేమ బంధానికి గుర్తుగా ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో జెనీలియా ఇంకా బెడ్ మీద నుంచి లేవనేలేదు.. కానీ రితేష్ మాత్రం షర్ట్ లేకుండా అలా లేచి జెనీలియాతో సరసాలు ఆడాడు. ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది.

తాజాగా జెనీలియా అలా..
జెనీలియా రామ్ కలిసి చేసిన వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తాను మొదటి సారిగా ఇన్ స్టా రీల్ వీడియోను చేస్తున్నాను అందుకే ఇలా అయిపోయిందంటూ పడిపోవడంపై క్లారిటీ ఇచ్చింది జెనీలియా. పక్కనే రామ్ ఉండటంతో ఆమెను పడిపోకుండా పట్టుకున్న సంగతి తెలిసిందే.

జెనీలియా చేతికి గాయం..
అయితే ఆ వీడియోలో అందరూ కూడా జెనీలియా చేతికి ఉన్న పట్టీని మాత్రమే చూశారు. జెనీలియా చేతికి ఎందుకు గాయమైంది? ఎలా అయింది? అంటూ తెగ ఆరా తీశారు. అయితే తాజాగా జెనీలియా మరో వీడియోను షేర్ చేసింది. ఇందులో రితేష్ తన భార్యకు సేవలు చేశాడు.
జడ వేసి సాయం..
జెనీలియా చేతికి గాయం అవ్వడంతో ఆమె జుట్టు వేసుకోవడానికి ఇబ్బంది పడినట్టుంది. అందుకే రితేష్ దగ్గరుండి మరీ జెనీలియాకు జుట్టు వేశాడు. ఇలా శ్రీవారి సేవలకు మురిసిపోయిన జెనీలియా ఆ వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











