twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమా షూటింగ్‌లోనే అంతా జరిగింది.. లవ్ స్టోరీ బయటపెట్టేసిన రోజా!!

    |

    సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. దర్శకులు హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు. ఇలా ఎన్నో రకాల జంటలున్నాయి. అందులో కొన్ని జీవిత కాలం పాటు నిలిచాయి. కొన్ని మధ్యలోనే ముగిసిపోయాయి. కానీ రోజా సెల్వమణి బంధం మాత్రం ఎప్పుడూ చూడముచ్చటగానే ఉంటుంది. రోజా తన ఫ్యామిలీని ఎంత కేరింగ్‌గా చూసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీకెండ్ వస్తే చాలు ఎంచక్కా ఫ్యామిలీతోనే గడిపేస్తుంది.

    అన్నింటిని బ్యాలెన్స్..

    అన్నింటిని బ్యాలెన్స్..

    రోజా ఓ వైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటుంది. మరో వైపు బుల్లితెరపై షూటింగ్‌లతో బిజీగా ఉంటుంది. ఇలా ఎంత బిజీగా ఉన్నా కూడా అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యామిలీతో టైం గడుపుతుంది. ఈ మధ్యే ఫ్యామిలీని కూడా సోషల్ మీడియాలో ఎక్కువ తీసుకోస్తుంది. అందరికీ పరిచయం చేస్తోంది.

    రెస్టారెంట్‌లో రచ్చ..

    రెస్టారెంట్‌లో రచ్చ..

    తాజాగా రోజా తన ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ సెల్ఫీలతో రచ్చ చేశారు. అయితే ఊరికే తినడం వరకే కాకుండా గరిట పట్టి పోజులు కూడా ఇచ్చింది. ఇలా రోజా తన ఫ్యామిలీతో కలిసి చేసే అల్లరి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇంత చక్కటి ఫ్యామిలీ ఇప్పుడు ఇలా ఉండటానికి బీజం సీతారత్నం గారి అబ్బాయి సినిమా షూటింగ్ టైంలో పడిందట.

    ఆ స్కిట్ ద్వారా..

    ఆ స్కిట్ ద్వారా..

    జబర్దస్త్‌లో వేసిన ఓ స్కిట్ ద్వారా రోజా తన ప్రేమ కథను బయట పెట్టాల్సి వచ్చింది. భవిష్యత్తు, గతంలోకి వెళ్లే వాచ్ అంటూ రోజా గతంలోకి వెళ్లారు. రోజాగా రష్మీ నటించింది. సెల్వమణిగా బుల్లెట్ భాస్కర్ నటించారు. వారిద్దరూ కలిసి ఏదో స్కిట్ వేశారు. రోజాకు ఐలవ్యూ చెప్పేందుకు సెల్వమణి తంటాలు పడుతున్నట్టుగా ఓ కథ అల్లారు.

    అసలు విషయం అది..

    అసలు విషయం అది..


    సెల్వమణి డైరెక్ట్‌గా నాకు ప్రపోజ్‌ చేయలేదు. మొదట మా ఇంట్లోవాళ్లకి చెప్పి వాళ్లు ఓకే అన్నాక.. ‘సీతారత్నంగారి అబ్బాయి' షూటింగ్‌ టైమ్‌లో నా దగ్గరకి వచ్చి ‘ఐ లవ్‌ యూ. మన పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకున్నారు అని వెరైటీగా ప్రపోజ్ చేశాడట. మొత్తానికి సెల్వమణి స్కెచ్ బాగానే వర్కవుట్ అయింది.

    English summary
    Roja ABout proposing And Love Story With Selvamani,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X