సింగర్ సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు: ఆమె పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారంటూ ఘాటుగా!

సింగర్ సునీత.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. చాలా కాలంగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నా.. ఇటీవలి కాలంలోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిందామె. దీనికి కారణం.. ఆమె రెండో పెళ్లి చేసుకోవడమే. దీనివల్ల ఈమె ఇండస్ట్రీలోనే కాక.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయారు. ప్రతి ఒక్కరూ ఆమె రెండో వివాహం గురించి మాట్లాడుతున్నారు. అందులో కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ హీరోయిన్ రోజా.. సునీత వెడ్డింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే..

Wet South Indian Actresses In Beach Photos

కొన్ని వేల పాటలు... ఫుల్ పాపులర్

కొన్ని వేల పాటలు... ఫుల్ పాపులర్

చిన్న వయసులోనే సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించారు సునీత. ఈ క్రమంలోనే చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుని ఊహించని రీతిలో పాపులర్ అయ్యారు. దక్షిణాదిలోని అన్ని భాషల్లో కొన్ని వేల పాటలను ఆలపించిన ఆమె.. ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పారు. దీంతో దాదాపు రెండు దశాబ్ధాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తున్నారు.

పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఫెయిల్యూర్

పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఫెయిల్యూర్

కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌‌లో ఉన్న సమయంలోనే అంటే టీనేజ్‌లోనే సునీతకు వివాహం అయింది. కొంత కాలం సంసారం సజావుగానే సాగింది. ఈ క్రమంలోనే ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు సునీత తన భర్తకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే న్యాయ బద్ధంగా విడాకులు కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగానే పిల్లలను పోషిస్తున్నారు.

ఆయనతో రహస్యంగా ఎంగేజ్‌మెంట్

ఆయనతో రహస్యంగా ఎంగేజ్‌మెంట్

సునీత రెండో పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తూ ఉండేవి. కానీ వాటిని ఆమె పలుమార్లు కొట్టి పారేశారు. ఈ నేపథ్యంలోనే ఈ టాప్ సింగర్ రెండో పెళ్లికి రెడీ అయ్యారు. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో గాయని సునీత వివాహం సెట్ అయింది. కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో రహస్యంగా జరిగినప్పటికీ.. అది లీక్ అయింది.

రెండో పెళ్లి చేసుకున్న సింగర్ సునీత

రెండో పెళ్లి చేసుకున్న సింగర్ సునీత

ముందుగా ఖరారు చేసిన దాని ప్రకారం.. జనవరి 9న శనివారం సాయంత్రం మీడియా దిగ్గజం రామ్ వీరపనేనితో సింగర్ సునీత రెండో పెళ్లి జరిగింది. హిందూ సంప్రదాయ ఆచారాల మధ్య జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. ఘనంగా జరిగిన ఈ వేడుకకు చాలా తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు.

సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు

సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు

సునీత రెండో పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది దీని గురించే మాట్లాడుతున్నారు. కొందరు సెలెబ్రిటీలు సైతం ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నాగబాబు సహా కొందరు సినీ ప్రముఖులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోయిన్ రోజా.. సునీత రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారంటూ

పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారంటూ

తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడిన రోజా.. 'సునీత రెండో పెళ్లి చేసుకోవడంపై చాలా మంది విమర్శిస్తున్నారు. అసలు వాళ్లు మనుషులేనా.? ఆమెకు ఓ తోడు అవసరం ఉండదా.? అది ఆలోచించకపోతే వాళ్ల పిల్లలు దీనికి ఎందుకు ఒప్పుకున్నారు? అసలు ఈ విషయంపై ఎవరూ స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆమె వ్యక్తిగతం' అంటూ ఘాటుగా స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X