Rolls Royce Ghost: రోల్స్ రాయిస్‌పై కన్నేసిన రాంచరణ్, ప్రభాస్, ఎన్టీఆర్.. విలాసవంతమైన కారు ధర ఎంతో తెలుసా?
సినీ తారలకు విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయడం, వివిధ రకాల కాస్ట్లీ వాహనాల కలెక్ట్ చేయడం హాబీగా పెట్టుకోవడం తెలిసిందే. అయితే మార్కెట్‌లోకి కొత్తగా వచ్చే విలాసవంతమైన కార్లను సొంతం చేసుకోవడంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోలు ముందుంటారనే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పటికే కోట్లాది రూపాయలు విలువ చేసే కార్లను సొంతం చేసుకొన్న స్టార్ హీరోలు ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ కారును సొంతం చేసుకొనేందుకు టాలీవుడ్ అగ్రహీరోలు కన్నేసినట్టు తెలుస్తున్నది. ఆ టాలీవుడ్ హీరోలు ఎవరనే వివరాల్లోకి వెళితే..
రోల్స్ రాయిస్ కంపెనీ కార్లకు సుమారుగా 120 సంవత్సరాల చరిత్ర ఉంది. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారు ఫీచర్స్ అత్యాధునిక సాంకేతికతో రూపొందించారు. దాని వీల్స్ ఇంతకుముందెన్నడూ లేని విధంగా లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించారు. ఈ కారకు ఫ్లాగ్ బెరర్ సిస్టమ్ అనే ఫీచర్ యాడ్ చేశారు. దాంతో ముందు ఉండే రోడ్డు పరిస్థితిని స్కాన్ చేస్తుంది. అలాగే శాటిలైట్ ఎయిడెడ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా బెస్ట్ గేర్ బేస్డ్ జీపీఎస్ యాక్టివేట్ అవుతుంది అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు సుమారుగా 17 కలర్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. డైమండ్ బ్లాక్, డార్కెస్ట్ టెంగ్‌స్టెన్, న్యూ సేబుల్, డార్క్ ఇండిగో, సీ గ్రీన్, మెట్రోపాలిటన్ గ్రీన్, లునార్ బ్లూ, జూబ్లి సిల్వర్, ఇంగ్లీష్ వైట్, ఎన్‌సైన్ రెడ్ లాంటి కలర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
ఇండియాలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ కార్ల ధరల విషయానికి వస్తే.. ఘోస్ట్ వీ12 బేస్ మోడల్ ఎక్స్ షో రూమ్ ధర 7 కోట్ల రూపాయలు, టాప్ మోడల్ ధర ఎక్స్‌టెండెడ్ ధర ఎక్స్ షో రూమ్ 8 కోట్ల రూపాయలు ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. లక్నో, న్యూ ఢిల్లీ, పూణేలో ఈ కారు అందుబాటులో ఉన్నాయి.
అయితే రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారుపై టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, రాంచరణ్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు కన్నేసినట్టు తెలుస్తున్నది. ఈ కారుపై మోజుపడిన కొందరు హీరోలు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారని తెలిసింది. అయితే ఎవరు ఈ కారును సొంతం చేసుకొంటారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











