అప్పుడు ఫస్ట్ టైమ్.. ఇప్పుడు సెకండ్ టైమ్.. సాయిపల్లవి సెన్సేషన్
ఫిదా భామ సాయి పల్లవి నెట్టింట సెన్సేషన్ స్టార్ గా అవతరించింది. యూత్ ఆడియన్స్ నెట్టింట అడుగుపెట్టారంటే చాలు మొదటగా సాయి పల్లవి పేరే సెర్చ్ చేస్తున్నారు. ఆమె డాన్స్, ఆకట్టుకునే చిందులు చూసేందుకు యువత మక్కువ చూపుతోంది. గతంలో ఫిదా సినిమాలోని 'వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే' పాటతో యంగ్ ఏజ్ అమ్మాయిలను గిలిగింతలు పెట్టిన సాయి పల్లవి.. ఈ మధ్యనే రౌడీ బేబీగా యమ హల్చల్ చేసింది. ఈ పాట నెట్టింట సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది.
మారి 2 సినిమా ధనుష్ తో కలిసి ఓ రేంజ్ హంగామా చేసింది సాయి పల్లవి. ఈ సినిమాలో ధనుష్, సాయి పల్లవి జంటగా చిందులేసిన రౌడీ బేబీ సాంగ్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. విడుదలై చాలా రోజులైనప్పటికీ నెట్టింట ఎక్కడ చూసినా ఇదే పాట కనిపిస్తూ ట్రేండింగ్ లో ఉంది. ఈ పాటను ధనుష్ రాసి.. ఆలపించడం విశేషం. ధనుష్ టోన్, స్టెప్పులు, ఆయనతో సాయి పల్లవి చిందులు పాటలో హైలైట్ కావడంతో ఈ పాట దక్షిణాది పాటల్లోకెల్లా సరికొత్త రికార్డు నమోదు చేసింది.

రిలీజైన కొన్ని రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఈ పాట.. అక్కడితో ఆగకుండా
200, 300 దాటి ఏకంగా 500 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. ఇప్పటికే సాయి పల్లవి పాటల విషయంలో రెండు రికార్డులు ఉన్నాయి. మొదటిది ఫిదా సినిమాలోని వచ్చిండే సాంగ్. ఈ సాంగ్ యూత్ కు బాగా నచ్చి 200 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇది ఒక రికార్డయితే... ఇప్పుడు ధనుష్ తో కలిసి చేసిన ఈ రౌడీ బేబీ సాంగ్ ఏకంగా 500 మిలియన్ వ్యూస్ రాబట్టడం మరో రికార్డ్. ఇక ఇటీవలే సూర్య సరసన ఎన్జీకే సినిమాలో నటించిన సాయిపల్లవి.. భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ లో హీరోయిన్ ఛాన్స్ పట్టేసిందని సమాచారం.


Click it and Unblock the Notifications











