RRR రిలీజ్‌కు లైన్ క్లియర్: హిస్టరీలోనే మొదటిసారి ఓ తెలుగు సినిమాకు భయపడుతున్నారట.!

By Manoj

దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' సిరీస్‌తో చేసిన హడావిడి మామూలుగా లేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంతో పాటు దేశం మొత్తం టాలీవుడ్‌ వైపు చూసేలా చేసింది. ఇంతటి బడా మూవీ తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమానే 'RRR'. తెలుగులోనే స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం.!

 టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు దించేశాడు

టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు దించేశాడు

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమే RRR. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో చెర్రీ.. అల్లూరిగా, తారక్.. కొమరం భీంగా కనిపించనున్నారు. అలాగే, ఈ మూవీలో అజయ్ దేవగణ్, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, అలీసన్ డూడీ సహా ఎంతో మంది నటిస్తున్నారు.

చాలా వరకు అయిపోయింది.. అసలైంది మిగిలింది

చాలా వరకు అయిపోయింది.. అసలైంది మిగిలింది

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాది పైగానే అవుతోంది. అయితే, ఇందులో నటించే హీరోలు సహా మిగిలిన నటుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పాటు పలు కారణాల వల్ల చాలా సార్లు అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ ఈ మూవీ షూటింగ్ 70 శాతం పూర్తయింది. మిగిలిన దాంట్లో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండిపోయింది.

ఫ్యాన్స్‌‌తో పాటు ప్రేక్షకులకు షాకిచ్చిన చిత్ర యూనిట్

ఫ్యాన్స్‌‌తో పాటు ప్రేక్షకులకు షాకిచ్చిన చిత్ర యూనిట్

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలో అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇటీవల ఆ తేదీని వచ్చే ఏడాది జనవరి 8కి మార్చింది. ఆలస్యం అయినా మీ అంచనాలను అందుకుంటామని ప్రకటించింది. దీంతో మెగా, నందమూరి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం నిరాశకు లోనయ్యారు.

అదిరిపోయే ప్లాన్ చేసిన జక్కన్న.. అందుకే ఆలస్యం

అదిరిపోయే ప్లాన్ చేసిన జక్కన్న.. అందుకే ఆలస్యం

భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రాబోతున్న ఈ సినిమాపై తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ సహా మొత్తం పది భాషల్లో విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకోసమే సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతుందనే టాక్ వినిపిస్తోంది.

షాక్‌కు గురి చేస్తున్న ప్రీ రిలీజ్ బిజినెస్

షాక్‌కు గురి చేస్తున్న ప్రీ రిలీజ్ బిజినెస్

‘బాహుబలి' మూవీ కోట్లు కొల్లగొట్టడంతో RRR మీద కూడా చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కన్నేసి ఉంచారు. ఎంత ఖర్చైనా భరించి కాసులు కురిపించుకోవాలని భావించారు. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని సమాచారం. ఇప్పటికే కొన్ని ఏరియాల రైట్స్ అమ్ముడపోయాయని అంటున్నారు. మొత్తంగా రూ. 600 కోట్ల పైచిలుకు బిజినెస్ జరిగే చాన్స్ ఉందని టాక్.

RRR రిలీజ్‌కు లైన్ క్లియర్.. హిస్టరీలోనే ఫస్ట్ టైమ్

RRR రిలీజ్‌కు లైన్ క్లియర్.. హిస్టరీలోనే ఫస్ట్ టైమ్

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకొచ్చింది. దీని ప్రకారం.. RRR విడుదల కాబోతున్న సంక్రాంతి సీజన్‌లో తమ సినిమాలను విడుదల చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు భయపడిపోతున్నారట. ఇందులో భాగంగానే తమ చిత్రాలను ముందుకు, వెనక్కి జరుపుతున్నారని సమాచారం. అందులో బడా హీరోల చిత్రాలుండడం విశేషం.

Recommended Video

Ram Charan & Jr NTR Special Pic With Ajay Devgn | RRR | SS Rajamouli | Filmibeat Telugu
 ఈ రేంజ్ రెస్పాన్స్ అస్సలు ఊహించరు

ఈ రేంజ్ రెస్పాన్స్ అస్సలు ఊహించరు

బాలీవుడ్ నిర్మాతలు తీసుకుంటున్న నిర్ణయాలతో RRRకు భారీ స్థాయిలో థియేటర్లు దొరికే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఈ సినిమాను కూడా పేరున్న సంస్థ హిందీలో విడుదల చేయబోతుందని అంటున్నారు. అక్కడి ఫిల్మ్ మేకర్లు వెనక్కి తగ్గడానికి ఇది కూడా ఓ కారణం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X