RRR Digital & Satellite Rights: ఇండియన్ సినిమా హిస్టరీలో పెను సంచలనం... అన్ని ఇండస్ట్రీలో ఇదే చర్చ!
ప్రపంచమే మెచ్చిన దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినీ చరిత్రలోనే హై రేంజ్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీలో ఫోకస్ చేశాయి. ఈ కారణంగానే ఈ మూవీ బిజినెస్ కూడా ఊహించని విధంగా జరుగుతోంది. ఇప్పటికే ఎంతో మంది దీనికి భారీ డీల్స్ ఆఫర్ చేశారు. ఇలాంటి సమయంలో ఓ విషయంలో చరిత్ర సృష్టించిందీ చిత్రం. ఆ వివరాలు మీకోసం!

రియల్ హీరోల్లా మారిన టాలీవుడ్ స్టార్ హీరోలు
ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తూ రియల్ హీరోలు అనిపించుకున్న అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, హీరోయిన్లు. ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. భీంగానూ నటిస్తోన్న విషయం తెలిసిందే.

చివరిది మొదలైంది... అంచనాలకు తగ్గట్లుగానే
RRR రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై రెండేళ్లకు పైగానే పూర్తయింది. కానీ, అనివార్య కారణాల వల్ల పలు ఆటంకాలు ఎదురవడంతో ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తీ కాలేదు. ఇక, ఇటీవలే క్లైమాక్స్ సీన్ చిత్రీకరణను ప్రారంభించారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్ వేశారు. అలాగే, అమెరికా నుంచి నలభై మంది ఫైటర్లను కూడా తీసుకొచ్చారు.

భీమ్.. రామరాజు.. రికార్డులు క్రియేట్ చేసేశారు
రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైన చాలా రోజుల వరకూ ఈ సినిమా నుంచి ఎటువంటి సర్‌ప్రైజ్‌లు రాలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇలాంటి సమయంలో మొదటిగా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం' విడుదలయ్యాయి. ఈ రెండూ రికార్డులు క్రియేట్ చేశాయి.

రిలీజ్ డేట్‌పై అనుమానాలు... పుకార్లు షికార్లు
నిజానికి RRRను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, అనుకున్న తేదీకి చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు కూడా అదే పరిస్థితి వల్ల అక్టోబర్ 13, 2021న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అయితే, ఈ తేదీ కూడా మారుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

భారీగా బిజినెస్... ఇండియాలోనే మొదటిసారి
పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న RRR (రౌద్రం రణం రుధిరం)పై దేశ వ్యాప్తంగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా ప్రభావం ఇండియన్ సినిమాపై భారీగా పడే అవకాశం ఉందని విశ్లేషకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. గతంలో ఏ సినిమాకూ లేని విధంగా ఈ చిత్రం అమ్ముడు పోవడం విశేషం.

రూ. 500 కోట్లతో సరికొత్త రికార్డు నమోదు చేసి
దక్షిణాదిలో నైజాం రూ. 75 కోట్లు, ఆంధ్ర, సీడెడ్ రూ.165 కోట్లు, తమిళనాడు రూ. 48 కోట్లు, కర్ణాటక రూ. 45 కోట్లు, కేరళ రూ. 15 కోట్లకు RRR హక్కులు అమ్ముడుపోయాయి. అంటే మొత్తంగా రూ. 348 కోట్లు వచ్చాయి. అలాగే, హిందీలో దాదాపు వంద కోట్ల బిజినెస్‌తో పాటు ఓవర్సీస్‌లో రూ. 70 కోట్ల వ్యాపారం జరిగింది. మొత్తంగా రూ. 500 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో పెను సంచలనం
తాజా సమాచారం ప్రకారం.. RRR మూవీ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం ఓ ప్రముఖ సంస్థ రూ. 225 కోట్లు ఆఫర్ చేసిందట. ఈ డీల్ నేడో రేపో క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంత మొత్తానికి ఏ సినిమా హక్కులూ అమ్ముడు పోకపోవడం విశేషం.


Click it and Unblock the Notifications











