For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాజమౌళి సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో... ఎన్టీఆర్ ముందే ఊహించాడు!

|
NTR Sky-high Elevation For SS Rajamouli In Instagram || Filmibeat Telugu

బాహుబలి తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న మరో భారీ చిత్రం RRR. మొదటి షెడ్యూల్ తర్వాత అనుకోని కారణాల వల్ల చాలా గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు రెండవ షెడ్యూల్ మంగళవారం బల్గేరియాలో ప్రారంభమైంది. ఇక్కడ జూ ఎన్టీఆర్‌పై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

తుఫాన్ వచ్చే ముందు సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. త్వరలో వెండి తెరపై తుఫాను క్రియేట్ చేయబోతున్న దర్శకుడు రాజమౌళి బల్గేరియా సెట్లో అలాగే ప్రశాంతంగా కనిపించాడని చెబుతూ ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఓ ఫోటో షేర్ చేశారు.

రాజమౌళి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో... ఎన్టీఆర్ ముందే ఊహించాడు

రాజమౌళి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో... ఎన్టీఆర్ ముందే ఊహించాడు

బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి' క్రియేట్ చేసిన స్ట్రోమ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి వచ్చే వరకు ఇండియన్ సినిమా చరిత్రలో రూ. 1000 కోట్ల వసూల్లు అనేవి లేవు. బాహుబలి 2 ఫుల్ రన్‌లో దాదాపు రూ. 1800 కోట్ల విధ్వంసకర వసూళ్లతో రికార్డులన్నీ బద్దలు కొడుతూ సంచలనం క్రియేట్ చేసింది. ప్రస్తుతం RRR సినిమా చేస్తున్న రాజమౌళి ఎఫెక్ట్ బాక్సాఫీస్‌పై వచ్చే ఏడాది ఎలా ఉంటుందో యంగ్ టైగర్ ముందే ఊహించాడు. అందుకే అతడిని ఉద్దేశించి ‘ది మ్యాన్ బిఫోర్ ది స్ట్రోమ్' అంటూ కామెంట్ చేశాడు.

బల్గేరియా సెట్లో రాజమౌళి

బల్గేరియా సెట్లో రాజమౌళి

మార్చిలో జరిగిన విలేకరుల సమావేశంలో రాజమౌళి మాట్లాడుతూ "ఈ చిత్రం అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా ఉంటుంది. ఈ స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల్లో మనకు తెలియని కోణాలు చాలా ఉన్నాయి. ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో కొంతకాలం పాటు ఎవరికీ కనిపించకుండా పోయారు. ఆ సమయంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఆ సమయంలో వారు కలుసుకుని ఉంటే ఏమి జరిగి ఉండేదో అనే ఒక కల్పిత కథతో చూపించాలనుకుంటున్నాము, " అన్నారు.

ఎన్టీఆర్, చరణ్

ఎన్టీఆర్, చరణ్

జూ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటించనున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్, అలియా భట్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించనున్నారు. అలియా రామ్ చరణ్‌కు జోడీగా కనిపించనుంది. ఎన్టీఆర్‌కు జోడీగా విదేశీ నటి కనిపించబోతోంది. గతంలో డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ పాత్రకు ఎంపికవ్వగా మధ్యలో తప్పుకుంది. దీంతో మరొక నటి కోసం వేట సాగుతోంది.

బాహుబలి మించే స్థాయిలో

బాహుబలి మించే స్థాయిలో

ఆర్‌ఆర్‌ఆర్ ప్రపంచవ్యాప్తంగా జూలై 30, 2020న 10 భారతీయ భాషల్లో విడుదల కానుంది. డి పార్వతి సమర్పణలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల బడ్జెట్‌ అంచనాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగు సినిమా గొప్పదనం మరింత పెంచేలా

తెలుగు సినిమా గొప్పదనం మరింత పెంచేలా

బాహుబలి తరువాత తెలుగు సినిమా గొప్పదనాన్ని మరింత పెంచే ఉన్నత ప్రమాణాలతో RRR చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత డివివి దానయ్య గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియాలోని టాప్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.

English summary
"The MAN before The STORM!" RRR avtor NTR shared Rajamouli's pic from the sets. The second schedule of SS Rajamouli’s upcoming magnum opus RRR begins on Tuesday in Bulgaria where the team will shoot important scenes featuring Jr NTR.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more