ఇండియన్ సినిమాలో RRR సంచలనం: రూ. 500 కోట్లతో సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించారుగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్న సినిమాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాపై అన్నీ ఇండస్ట్రీలూ దృష్టి సారించాయి. దీనికి కారణం ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడానికి తోడు.. బడా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండడమే. అంతేకాదు, ఇది టాలీవుడ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. విడుదలకు ముందే ఇంత ఖ్యాతి గడించిన ఈ సినిమా.. తాజాగా ఇండియన్ సినిమాలో సంచలనం సృష్టించింది. ఆ వివరాలు మీకోసం!

విప్లవ వీరుల కథ.. వాళ్లందరూ భాగమయ్యారు
విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ సహా ఎంతో మంది నటిస్తున్నారు. ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. భీంగా చేస్తున్నారు.

రెండేళ్లు పూర్తి.. అసలైంది ఇప్పుడు మొదలైంది
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న RRR రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై రెండేళ్లకు పైగానే అవుతోంది. దీనికి పలుమార్లు ఆటంకం ఏర్పడడం వల్ల షూటింగ్ ఇంకా పూర్తవలేదు. అంతేందుకు ఎంతో ముఖ్యమైన కాంబినేషన్ సీన్స్‌తో పాటు ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చిత్రీకరించలేదు. వీటిలో ఇటీవలే క్లైమాక్స్ సీన్ షూటింగ్ మొదలైంది.

రెండు వీడియోలు రిలీజ్.. లెక్కలేనన్ని రికార్డ్స్
రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైన చాలా రోజుల వరకూ ఈ సినిమా నుంచి ఎటువంటి సర్‌ప్రైజ్‌లు రాలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇలాంటి సమయంలో మొదటిగా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం' విడుదలయ్యాయి. ఈ రెండూ రికార్డులు క్రియేట్ చేశాయి.

రిలీజ్ డేట్‌పై అనుమానం... ఇదైనా నిజమేనా?
వాస్తవానికి RRRను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ షూటింగ్ ప్రారంభించే సమయంలోనే ప్రకటించింది. కానీ, అనుకున్న తేదీకి చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఈ మూవీని అక్టోబర్ 13, 2021న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇండియన్ సినిమాలో RRR పెను సంచలనం
పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న RRR (రౌద్రం రణం రుధిరం)పై దేశ వ్యాప్తంగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా ప్రభావం ఇండియన్ సినిమాపై భారీగా పడే అవకాశం ఉందని విశ్లేషకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. గతంలో ఏ సినిమాకూ లేని విధంగా ఈ చిత్రం అమ్ముడు పోవడం విశేషం.

రూ. 500 కోట్లతో సరికొత్త రికార్డు నమోదైంది
దక్షిణాదిలో నైజాం రూ. 75 కోట్లు, ఆంధ్ర, సీడెడ్ రూ.165 కోట్లు, తమిళనాడు రూ. 48 కోట్లు, కర్ణాటక రూ. 45 కోట్లు, కేరళ రూ. 15 కోట్లకు RRR హక్కులు అమ్ముడుపోయాయి. అంటే మొత్తంగా రూ. 348 కోట్లు వచ్చాయి. అలాగే, హిందీలో దాదాపు వంద కోట్ల బిజినెస్‌తో పాటు ఓవర్సీస్‌లో రూ. 70 కోట్ల వ్యాపారం జరిగింది. మొత్తంగా రూ. 500 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

బాహుబలి 2కు అలా.. అదే రితిలో వచ్చింది
గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి 2'కు దక్షిణాదిలో రూ. 220 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. దీనికి ఏకంగా రూ. 350 కోట్ల వరకూ కలెక్షన్లు వచ్చాయి. ఈ ధైర్యంతోనే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తం వెచ్చించి మరీ RRR రైట్స్ తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక, రిలీజ్‌కు ముందు జరిగిన బిజినెస్ లెక్కలు చూసిన వారంతా షాకైపోతున్నారు.


Click it and Unblock the Notifications











