Don't Miss!
- Finance
womens ipl: ఒకే ఆటలో అంబానీ-అదానీ.. పిచ్ లో నిలిచేదెవరు..? చివరికి గెలిచేదెవరు..?
- Sports
4 వన్డేల్లో 2 సెంచరీలు.. ఒక డబుల్ సెంచరీ.. రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్!
- News
Wife: నేను ఉద్యోగం చేస్తుంటే నా భార్య మస్త్ మజా చేస్తోంది. కుక్కర్ తో కొట్టి, గొంతు కోసి హత్య, తుపాకి దెబ్బతో
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 5 అంశాలు ప్రాణాలు తీస్తాయి, వాటితో జాగ్రత్త అవసరం
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
RRR లాస్ ఏంజెలెస్ స్పెషల్ స్క్రీనింగ్ షో.. 98 సెకన్లలో హౌస్‌ఫుల్.. ఫ్యాన్స్ తాకిడికి వెబ్‌సైట్ క్రాష్
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనాలకు వేదికగా మారింది. గతేడాది రిలీజైన ఈ చిత్రం థియేట్రికల్‌గా రికార్డు వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులను సొంతం చేసుకొంటూ తెలుగు సినిమా పరిశ్రమ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పుతున్నది. అయితే తాజాగా RRR సినిమాను లాస్ ఏంజెలెస్‌లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయగా మరో సంచలనం నమోదు చేసింది. RRR సినిమా, లాస్ ఎంజెలెస్ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే...

ఏడాది కావొస్తున్న క్రేజ్ తగ్గని RRR
RRR మూవీ థియేట్రికల్ రన్‌లో 1000 కోట్లకుపైగా వసూళ్లను సాధించడం, ఆ తర్వాత ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో చరిత్ర సృష్టించింది. ఈ సినిమా రిలీజై ఏడాది కావోస్తున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ సినిమా ఎప్పటికప్పుడు కొత్త సంచలనాలకు అడ్డగా మారుతున్నది. అవార్డులు, రివార్డుల గెలుచుకొంటూ వినోద రంగంలో దేశ ప్రతిష్టను పెంపొదిస్తున్నది.

ఆస్కార్ అవార్డులకు నామినేట్
ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారం, సినిమారంగంలో నోబెల్ లాంటి ఆస్కార్ అవార్డులకు భారతదేశం నుంచి నామినేట్ అయ్యే అవకాశం కోల్పోయిన ఈ చిత్రం ప్రత్యేక ఎంట్రీ ద్వారా ఆస్కార్‌కు నామినేట్ అయింది. త్వరలోనే ఆస్కార్ అవార్డుల వేడుకలో సత్తా చాటేందుకు సిద్దమైంది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం రాంచరణ్, ఉపాసన
ఇదిలా ఉండగా, అమెరికాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి RRR చిత్ర యూనిట్ హజరవుతున్నది. ఇప్పటికే రాజమౌళి, రాంచరణ్, ఉపాసన కొణిదెల, రమా రాజమౌళి, వల్లి, కార్తీకేయ, సినిమా యూనిట్ సభ్యులు లాస్ ఎంజెలెస్‌కు చేరుకొన్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో RRR మూవీ పలు విభాగాల్లో పోటీ పడుతున్నది.

లాస్ ఎంజెలెస్‌లో స్పెషల్ స్క్రీనింగ్
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి ముందుగా లాస్ ఎంజెలెస్‌లో RRR సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సినిమా అడ్వాన్సు బుకింగ్ ఓపెన్ కాగానే.. కేవలం 98 సెకన్లలోనే దాదాపు టికెట్లు అన్నీ అమ్ముడుపోవడం రికార్డుగా మారింది. అంతేకాకుండా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ క్రాష్ అవ్వడం సెన్సేషన్‌గా మారింది.

98 సెకన్లలో 900 టికెట్లు అమ్మకం
RRR మూవీని జూన్ 9వ తేదీన లాస్ ఎంజెలెస్‌లోని ఐమాక్స్ థియేటర్‌లో స్పెషల్ షో ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా కోసం టికెట్లు ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయగానే 900 టికెట్లు కేవలం 98 సెకన్లలో అమ్ముడుపోయాయి. ఒక్కసారిగా యూజర్లు పోటెత్తడంతో వెబ్‌సైట్ క్రాష్ అయింది అని స్థానికులు తెలిపారు.