Don't Miss!
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
RRR సంక్రాంతి సర్ప్రైజ్ ఇదే: అందరు నటులూ ఒకే చోట.. కన్నుల పండుగగా స్పెషల్ వీడియో
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలు రూపొందుతూ ఉంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ప్రత్యేకమైనవిగా నిలుస్తుంటాయి. అలాంటి వాటిలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. టాలీవుడ్ హిస్టరీలోనే బడా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీనికితోడు ఇది భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. దీంతో ఈ మూవీ కోసం అంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సంక్రాంతి కానుకగా RRR నుంచి సర్ప్రైజ్ వీడియో రాబోతుంది. ఆ వివరాలు మీకోసం!
Recommended Video
రియల్ హీరోల కథతో వస్తున్న RRR
విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోన్న మూవీ RRR. ఇందులో చరణ్.. అల్లూరి గానూ, తారక్.. భీంగానూ నటిస్తున్నారు. వీరితో పాటు హాలీవుడ్, బాలీవుడ్ సహా ఇతర పరిశ్రమలకు చెందిన నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఐదు భాషల్లో రాబోతున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
రెండు సార్లు వాయిదా పడిపోయింది
RRR షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే అవుతోంది. అయినప్పటికీ పలుమార్లు ఆటంకం ఏర్పడడం వల్ల ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తవలేదు. అంతేందుకు ఎంతో ముఖ్యమైన కాంబినేషన్ సీన్స్‌తో పాటు ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చిత్రీకరించలేదు. దీంతో ఈ మూవీ విడుదలను రెండు సార్లు వాయిదా వేసింది చిత్ర యూనిట్.
మూడు రిలీజ్.. అదిరిపోయే రెస్పాన్స్
ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కొన్ని అప్డేట్లు మాత్రమే వచ్చాయి. మొదటిగా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ ఇంట్రడక్షన్ వీడియో 'భీం ఫర్ రామరాజు' విడుదలైంది. దీనికీ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ మధ్య వచ్చిన ఎన్టీఆర్ పరిచయ వీడియో అయితే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టింది.
స్పీడుకు బ్రేకులు వేసిన కరోనా వైరస్
కరోనా తర్వాత వేగం పెంచిన చిత్ర యూనిట్ వరుస షెడ్యూళ్లను పూర్తి చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, కర్నాటక షెడ్యూళ్లు కంప్లీట్ చేసేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మొదట దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇక, ఈ మధ్య చిత్ర హీరో రామ్ చరణ్‌కు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో సినిమా షూటింగ్ మళ్లీ ఆగిపోయింది.
సంక్రాంతి సర్ప్రైజ్ ఇదే.. అంతా ఒకేచోట
ప్రతి పండుగకూ బడా సినిమాల నుంచి సర్ప్రైజ్లు వస్తుంటాయి. మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో ఇవి కాస్తా ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో RRR యూనిట్ నుంచి ఎలాంటి కానుక వస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర యూనిట్ ఓ స్పెషల్ వీడియోను రెడీ చేసినట్లు తాజాగా ఒక న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.
కన్నుల పండుగగా స్పెషల్ వీడియో
తాజా సమాచారం ప్రకారం.. RRR థీమ్ సాంగ్‌తో కూడిన వీడియోను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారట. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, ఓలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ సహా సినిమాలో నటించిన ప్రతీ యాక్టర్ ఇందులో కనిపిస్తారట. అంతేకాదు, టెక్నికల్ టీమ్ రాజమౌళి అండ్ కో కూడా ఈ వీడియోలో సందడి చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.