twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR నుంచి బిగ్ సర్‌ప్రైజ్: ఎన్టీఆర్ వీడియోకు డేట్ ఫిక్స్.. బర్త్‌డే గిఫ్ట్ రెడీ చేసిన జక్కన్న

    By Manoj
    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). 'బాహుబలి' వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ ప్రాజెక్టుకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఫస్ట్‌ లుక్ వీడియో డేట్ లీక్ అయింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

    Recommended Video

    RRR Update: NTR Komaram Bheem First Look Video On Sr NTR's Birthday
    ఇద్దరు రియల్ హీరోల కోసం వీళ్లు కలిశారు

    ఇద్దరు రియల్ హీరోల కోసం వీళ్లు కలిశారు

    టాలీవుడ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రం RRR. రాజమౌళి తీస్తున్న ఈ సినిమా రియల్ హీరోలు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో అల్లూరిగా రామ్ చరణ్, భీంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అలాగే, ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    RRR మూవీకే ఎందుకిలా జరుగుతోందబ్బా.!

    RRR మూవీకే ఎందుకిలా జరుగుతోందబ్బా.!

    భారీ మల్టీస్టారర్ మూవీగా రూపు దిద్దుకుంటోన్న RRRకు వరుసగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. నటీనటుల డేట్స్ సమస్య, ప్రతికూల వాతావరణం, హీరోలకు గాయాలు సహా కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ సినిమా షూటింగ్ పలుమార్లు ఆగిపోయింది. ఈ కారణంగానే RRR షూటింగ్ ఏడాదిన్నర కాలంలో కేవలం డెబ్బై ఐదు శాతమే కంప్లీట్ అయింది.

    మరోసారి మాట తప్పిన రాజమౌళి అండ్ టీమ్

    మరోసారి మాట తప్పిన రాజమౌళి అండ్ టీమ్

    వాస్తవానికి ఈ సినిమాను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ మొదట్లో ప్రకటించింది. కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో దానిని జనవరి 8, 2021కి వాయిదా వేసింది. అయితే, ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌కు దాదాపు మూడు నెలలు విరామం రావడంతో RRR మరోసారి వాయిదా పడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

    ఒక్క దానితో అంచనాలు భారీగా పెంచారు

    ఒక్క దానితో అంచనాలు భారీగా పెంచారు

    RRR షూటింగ్ ప్రారంభమైన చాలా రోజులకు ఆ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత అంటే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని అతడి లుక్‌కు సంబంధించిన వీడియోను వదిలారు. భీమ్ ఫర్ రామరాజు పేరిట వచ్చిన ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ రావడంతో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి.

    చరణ్‌కు కుదిరింది.. ఎన్టీఆర్‌కు సెట్ కాలేదు

    చరణ్‌కు కుదిరింది.. ఎన్టీఆర్‌కు సెట్ కాలేదు

    రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి లుక్ విడుదల చేయగా... ఎన్టీఆర్ బర్త్‌డేకు కొమరం భీం లుక్ రివీల్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, కరోనా ప్రభావంతో అది సాధ్యం కాలేదు. దీనిపై స్వయంగా జూనియర్ రంగంలోకి దిగి ఫ్యాన్స్‌ను సముదాయించాడు. దీంతో ఒక్కటంటే ఒక్క గిఫ్ట్ కూడా లేకుండానే 2020లో తారక్ పుట్టినరోజు గడిపోయింది.

    బిగ్ సర్‌ప్రైజ్: ఎన్టీఆర్ వీడియోకు డేట్ ఫిక్స్

    బిగ్ సర్‌ప్రైజ్: ఎన్టీఆర్ వీడియోకు డేట్ ఫిక్స్

    ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విషయంలో... లాక్‌డౌన్ కారణంగా క్వాలిటీ లేని వీడియోను అందించడం కంటే.. ఆలస్యమైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఏ రోజున ఎన్టీఆర్ వీడియోను వదులుతారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో దానికి రాజమౌళి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది.

    ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్ రెడీ చేసిన జక్కన్న

    ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్ రెడీ చేసిన జక్కన్న

    మే 28న సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని RRRలో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేయబోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల జరిగిన చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇచ్చింది. దీంతో రాజమౌళి అండ్ టీమ్ ఎన్టీఆర్ వీడియోను రెడీ చేసేస్తున్నారని సమాచారం.

    English summary
    Roudram Ranam Rudhiram is an upcoming 2021 Indian Telugu-language period action film written and directed by S. S. Rajamouli. It stars N. T. Rama Rao Jr., Ram Charan, Alia Bhatt and Ajay Devgn.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X