Sridevi Death Anniversary: శ్రీదేవి మరణంపై అనుమానాలు.. హత్య కోణమా? యాక్సిడెంటా? వాస్తవమేంటి?

లెజెండరీ హీరోయిన్ శ్రీదేవీ ఆకస్మిక మరణం ఇప్పటికీ అభిమానులను వెంటాడుతూనే ఉంది.ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయి సుమారుగా 6 సంవత్సరాలు కావోస్తున్న ఆమె గ్లామర్, నటించిన సినిమాలు ఇప్పటికీ చెరగని ముద్ర వేశాయి. అయితే దుబాయ్‌లో 2018 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన శ్రీదేవీ ఇక లేరంటూ వచ్చిన వార్త అభిమానులను గుండె పగిలేలా చేసింది. ఆమె మరణం ఓ మిస్టరీగా మారింది. దుబాయ్‌లో రెండు రోజులపాటు సాగిన ఉత్కంఠ సమయంలో తలెత్తిన అనుమానాలు, సందేహాలు అనేక రూమర్లకు ప్రాణం పోశాయి. శ్రీదేవీ మరణం గురించిన మిస్టరీ, డ్రామా గురించిన వివరాల్లోకి వెళితే..

తన కుటుంబానికి సంబంధించిన వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన శ్రీదేవీ దుబాయ్‌లోని ప్రముఖ హోటల్‌లో బస చేశారు. అయితే ఆ క్రమంలోనే ఆమె మరణించడంతో సినీ, సాధారణ ప్రజానీకం దిగ్బ్రాంతికి గురయ్యారు. తొలుత గుండెపోటుతో ఆమె మరణించారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ తర్వాత దుబాయ్ పోలీసులు వివరణ ఇస్తూ.. ఆమె బాత్ టబ్‌లో స్నానం చేస్తుండగా మునిగి ఊపిరి ఆడక చనిపోయారు అని తేల్చారు. ఈ రెండు వార్తలు ఒకదానికి ఒకటి పొంతన లేకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తాయి.

Rumors behind Sridevi Death

ఇదిలా ఉంటే.. శ్రీదేవి మరణం వెనుక హత్య కోణం ఉంది. అండర్ వరల్డ్ ఆమెను టార్గెట్ చేసి చంపేశారు అనే రూమర్ బయటకు వచ్చింది. అయితే ఆ వార్త మాత్రం రూమర్‌గానే మిగిలిపోయింది. అయితే శ్రీదేవీ మరణం తర్వాత భర్త బోని కపూర్‌ను దుబాయ్ పోలీసులు సుమారుగా 24 గంటలపాటు విచారించడంతో ఆయన పాత్ర ఏమైనా ఉందా? అనే అనుమానం మరో కోణంలో బయటకు వచ్చింది. ఆమె మరణం సమయంలో ఆయన మాత్రమే ఉండటంతో అనేక సందేహాలు అతడి చుట్టే తిరిగాయి.

శ్రీదేవీ చనిపోయే నాటికి ఆమె పేరిట భారీగా ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. దాదాపు 240 కోట్ల రూపాయల మేర ఇన్సూరెన్స్ ఉంది. అందుకే ఆమె మరణం వెనుక బోని కపూర్ హస్తం ఉందా? అనే కోణంలో కథనాలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా మితీమీరిన మద్యంతోపాటు మెడిసిన్ కూడా తీసుకోవడం వల్ల ఆమె ప్రాణాలు పోయాయనే మరో కథనం కూడా మీడియాలో స్వైర విహారం చేసింది. ఇలాంటి వార్తలనే ఊహగానాలే. వాటిలో పసలేదనే విషయం స్పష్టమైంది.

అయితే శ్రీదేవీ మరణం గురించి బోని కపూర్ ఓ ఇంటర్వూ సందర్భంగా మాట్లాడుతూ.. అందంగా, నాజుకుగా కనిపించడానికి ఆమె చాలా డైటింగ్ చేసే వారు. దాంతో మెదడులో బ్లాకౌట్స్, లో బీపీ లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. బాత్ టబ్‌లో ఉన్న సమయంలో ఆమె సృహకోల్పోయి ఉంటారు. ఆ సమయంలో మునిగి తుదిశ్వాస విడిచి ఉంటారు అని క్లారిటీ ఇచ్చారు.

శ్రీదేవీ మరణం గురించి వచ్చిన అనుమానాలపై దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్లారిటీ ఇచ్చారు. ఈ మరణం కేసును దర్యాప్తు చేసిన అధికారులు స్పృహ కోల్పోయిన ఆమె.. మునిగి చనిపోయారు. ఆమె మరణం వెనుక ఎలాంటి హత్య కోణం లేదు. కేవలం ప్రమాదవశాత్తు ఆమె చనిపోయారనే విషయం దర్యాప్తు తేలింది అని చెప్పారు. ఆ తర్వాత దుబాయ్‌లో ఈ కేసును క్లోజ్ చేయడంతో రూమర్లు తెరపడింది.

More from Filmibeat

Read more about: sridevi boney kapoor dubai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X