The Challenge అంతరిక్షంలో తొలి చిత్రం.. చరిత్ర సృష్టించిన రష్యా.. బడ్జెట్ RRR కంటే తక్కువే!
అంతరిక్షంలో షూట్ చేసిన తొలి సినిమా ది ఛాలెంజ్‌ను రష్యాలోని సినిమా హాళ్లలో ఇటీవల ప్రదర్శించారు. గాయపడిన అంతరిక్ష శాస్త్రజుడుని కాపాడేందుకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కు పంపిన సర్జన్ కథా నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది.
2021 అక్టోబర్ మాసంలో 12 రోజులో ఓ నటిని, దర్శకుడిని అంతరిక్షంలోకి పంపించి ఈ సినిమాను తెరకెక్కించే వినూత్న ప్రయోగానికి రష్యా శ్రీకారం చుట్టింది. ఈ అరుదైన చిత్రాన్ని రూపొందించిన యూనిట్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ట్రామ్ క్రూజ్ కంటే ముందుగానే..: ఉక్రెయిన్ విషయంలో అమెరికాపై ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నిస్తున్న రష్యా.. అంతరిక్షంలో హాలీవుడ్ నిర్మించడానికి నటుడు టామ్ క్రూజ్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఓ ప్రాజెక్టును 2020లో ప్రకటించారు. అయితే టామ్ క్రూజ్ సినిమా కంటే ముందుగానే ది ఛాలెంజ్ సినిమాను రూపొందించి ప్రదర్శించి అగ్రదేశానికి రష్యన్లు సవాల్ విసిరారు.
మేమే ఫస్ట్.. చరిత్ర సృష్టించాం: అంతరిక్షంలో తొలి సినిమాను షూట్ చేసిన ఘనత మనకే దక్కింది. మరోసారి దేనిలోనైనా మనమే ఫస్ట్ అని నిరూపించాం అని పుతిన్ అన్నారు. అంతరిక్షంలోకి మొదటి శునకాన్ని, పురుషుడిని, మహిళను పంపిన ఘనత రష్యాదే కావడం గమనార్హం. ప్రస్తుతం అంతరిక్షంలో సినిమా తీసిన చరిత్ర మాకే దక్కిందని రష్యన్లు గర్వంగా చెప్పుకొంటున్నారు.

యాక్టర్, డైరెక్టర్ గురించి: ది ఛాలెంజ్ సినిమా విషయానికి వస్తే.. రష్యా సినిమా పరిశ్రమలో గ్లామర్ క్వీన్‌గా పేరున్న 38 ఏల్ల యూలియా పెరెసిల్ద్ నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన క్లిమ్ షిపెంకో, కెమెరా, లైటింగ్, సౌండ్ విభాగాలను స్వయంగా పర్యవేక్షించారు. దాదాపు 30 గంటల ఫుటేజ్‌ను షూట్ చేసి.. దాదాపు 50 నిమిషాల ఫైనల్ కట్‌ను ప్రేక్షకుల ముందు పెట్టారు.
నాలుగు నెలలపాటు శిక్షణ: అంతరిక్షంలోకి వెళ్లే ముందు నటి యూలియా పెరెసిల్ద్, డైరెక్టర్ క్లిమ్ షిపెంకో దాదాపు సోయజ్ స్పేస్ క్రాఫ్ట్‌లో నాలుగు నెలలపాటు శిక్షణ పొందారు. ఈ చిత్రంలో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లో ఉన్న ముగ్గురు వ్యోమగాములు అతిథి పాత్రలను పోషించడం విశేషంగా మారింది. ఈ సినిమాకు రష్యాలో అనూహ్యమైన స్పందన లభిస్తున్నది.

RRR కంటే తక్కువ బడ్జెట్‌తో: అంతరిక్షంలో ది ఛాలెంజ్ సినిమాను షూట్ వెళ్లిన యూలియా, క్లిమ్ షిపెంకోను తిరిగి భూమికి తీసుకొచ్చిన సోజయ్ ఎంఎస్ 18 వ్యోమనౌకను సెంట్రల్ మాస్కోలో ప్రజల సందర్శనార్థం పెట్టారు. ఈ సినిమా నిర్మించాడానికి 12 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో సుమారు 100 కోట్ల రూపాయలు అయింది. RRR మూవీ బడ్జెట్‌లో ఈ సినిమా వ్యయం నాలుగో వంతు కంటే తక్కువే అని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











