రామ్ చరణ్ మూవీపై శంకర్ సంచలన నిర్ణయం: కెరీర్‌లో మొదటిసారి అలా.. ఆయన మాత్రం ఫుల్ హ్యాపీ

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న అతడు.. ఆ తర్వాత కూడా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని పరాజయాలు వచ్చినా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇక, ప్రస్తుతం భారీ చిత్రంలో భాగమైన రామ్ చరణ్.. దీని తర్వాత కూడా లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో బిగ్ బడ్జెట్ మూవీని చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

రెండు సినిమాలతో రెడీ అయిన చరణ్

రెండు సినిమాలతో రెడీ అయిన చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం)లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఇందులో అతడు అల్లూరిగా, తారక్ కొమరం భీంగా కనిపించనున్నారు. దీనితో పాటు చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య'లోనూ సిద్ధ అనే నక్సలైట్ పాత్రను పోషించాడు.

లెజెండరీ దర్శకుడితో చరణ్ సినిమా

లెజెండరీ దర్శకుడితో చరణ్ సినిమా

RRR, ఆచార్య తర్వాత రామ్ చరణ్ నటించబోయే ప్రాజెక్టు గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకులు పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఊహించని విధంగా చెర్రీ.. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ భారీ రేంజ్‌లో రాబోతుంది.

శంకర్ ఫోకస్ మొత్తం దీనిపైనే ఉంది

శంకర్ ఫోకస్ మొత్తం దీనిపైనే ఉంది

డైరెక్టర్ శంకర్‌.. కమల్ హాసన్‌తో 'భారతీయుడు 2' అనే ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే, కొన్ని వివాదాల కారణంగా అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో నిర్మాణ సంస్థతో ఆయనకు విభేదాలు రావడంతో ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. కానీ, ఇటీవలే దీనికి కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో శంకర్.. రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాపై పూర్తిగా ఫోకస్ చేశారని అంటున్నారు.

అవన్నీ పూర్తి చేసేసిన శంకర్.. వాళ్లు

అవన్నీ పూర్తి చేసేసిన శంకర్.. వాళ్లు

చరణ్‌తో చేసే సినిమా కోసం శంకర్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టి.. దాదాపుగా వాటిని పూర్తి చేసేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఈ మూవీ కాస్టింగ్‌ మీద దృష్టి సారించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జయరాం, శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులను ఎంపిక చేశారు. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్, హీరోయిన్‌గా కియారా అద్వాణీని తీసుకున్నారు.

గ్రాండ్‌గా ప్రారంభం.. వాళ్లంతా వచ్చి

గ్రాండ్‌గా ప్రారంభం.. వాళ్లంతా వచ్చి

దిగ్గజ దర్శకుడు శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను సెప్టెంబర్ 8న అంగరంగ వైభవంగా జరిగాయి. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దీంతో ఈ వేడుక ఎంతో సందడిగా సాగింది. ఆరోజు యూనిట్ వదిలిన పోస్టర్ అంచనాలు పెంచేసింది.

ఈ మూవీపై శంకర్ సంచలన నిర్ణయం

ఈ మూవీపై శంకర్ సంచలన నిర్ణయం

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీ కోసం డైరెక్టర్ శంకర్ ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే కాస్త తగ్గించినట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన సినిమాలంటే హౌ రేంజ్‌లో ఉంటాయి. అయితే, ఈ చిత్రానికి మాత్రం తన పంథాను మార్చారని అంటున్నారు. దీనిపై దిల్ రాజు ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X