సచిన్ టెండూల్కర్‌కు బిగ్‌బాస్ విన్నర్‌తో చేదు అనుభవం.. భగవంతుడా అంటూ ఫ్యాన్స్ కంటతడి!!
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ప్రారంభ వేడుక ముంబైలోని స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. భారతీయ సినిమా, క్రికెట్ అభిమానులకు కన్నుల పండుగగా మారిన ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్షయ్ కుమార్, సూర్య, బోమన్ ఇరానీ, సచిన్ టెండూల్కర్, ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రారంభ వేడుకలో భాగంగా జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ అవుటైన తీరు అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ 2024 సందర్భంగా కర్టన్ రైజర్ మ్యాచ్ సెలబ్రిటీల మధ్య జరిగింది. మాస్టర్స్ ఎలెవన్ జట్టుకు సచిన్ టెండూల్కర్ నేతృత్వం వహించారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సచిన్ జట్టులో అక్షయ్ కుమార్, ఎల్వీష్ యాదవ్, సురేష్ రైనా, స్టువార్ట్ బిన్నీ, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, ప్రవీణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు.

ఐఎస్‌పీఎల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ మరోసారి బంతి, బ్యాట్‌లో మ్యాజిక్ మూమెంట్స్ క్రియేట్ చేశారు. సచిన్ బ్యాటింగ్ చేసిన తీరుతో ఇంకా ఆయన మైదానంలో ఉండాల్సిందనే ఫీలింగ్ ప్రతీ క్రికెట్ అభిమానుల్లో కలుగజేసింది. అయితే సచిన్ అవుటైన తీరు అభిమానులకు జీర్ణించుకోలేని విషయంగా మారింది.
సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టి గ్రౌండ్‌లో బౌలర్లను గడగడలాడించారు. కేవలం 16 బంతుల్లో 30 పరుగులతో మంచి జోష్‌తో బ్యాటింగ్ చేశారు. కానీ బిగ్‌బాస్ విన్నర్, స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ వేసిన బంతి టాప్ ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ నామన్ ఓజా చేతుల్లోకి వెళ్లింది. దాంతో సచిన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
సచిన్ టెండూల్కర్ అవుట్ అవ్వగానే స్టేడియం అంతా నిశ్శబ్దంగా మారింది. మాస్టర్ బ్లాస్టర్ అవుట్ కాగానే ప్రపంచం ఓ క్షణకాలం ఆగిపోయిందా? అనే ఫీలింగ్ కలిగించింది. అయితే స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ చేతిలో అవుట్ అవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. కమెడియన్ చేతిలో ఓడిపోవడం ఏమిటిరా భగవంతుడా.. సచిన్ కెరీర్‌లో ఇంత కంటే ఘోరమైన అవుట్ ఉండదు అంటూ నెటిజన్లు కంటతడి పెట్టినంత పనిచేశారు.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) విషయానికి వస్తే.. దేశంలోని ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించే లక్ష్యంతో ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌లో అమితాబ బచ్చన్ యజమానిగా మాజీ ముంబై జట్టు, శ్రీనగర్ కే వీర్ జట్టుకు ఓనర్‌గా అక్షయ్ కుమార్, బెంగళూరు స్ట్రైకర్స్ జట్టుకు హృతిక్ రోషన్, చెన్నై సింగమ్ జట్టుకు సూర్య, ఫాల్కన్ రైజర్స్ జట్టుకు రాంచరణ్, టైగర్ ఆఫ్ కోల్‌కతా జట్టుకు సైఫ్ ఆలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ యజమానులుగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











