ఒకరి పరువు ఇంకొకరు తీసుకుంటున్నారు.. మెగా హీరోల చర్యలు ఊహాతీతం!
సోషల్ మీడియాలో మెగా హీరోలు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక ఎక్కువగా హల్చల్ చేస్తుంటారు. వరుణ్, సాయి ధరమ్ తేజ్ అయితే మరీ ఎక్కువగా సెటైర్లు వేస్తుంటారు. బయట వచ్చే గాసిప్స్, రాసే రూమర్లపై తమదైన శైలిలో కౌంటర్స్ వేస్తుంటారు. పెళ్లిపై వచ్చిన రూమర్స్‌ను ఎన్సి సార్లు ఖండిస్తూ సెటైర్స్ వేశారో అందరికీ తెలిసిందే. తాజాగా వీరిద్దరూ తమ పరువును తామే తీసుకుంటున్నారు. పాత ఫోటోలను షేర్ చేసుకుంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు.
Recommended Video

మెగా హీరోల సందడి..
ఏదైనా ఈవెంట్ జరిగినా, పండుగలు వచ్చినా మెగా ఫ్యామిలీ అంతా ఒకేచోట చేరుతుంది. ఇక తారలంతా ఒకే చోట ఉంటే ఫోటోలు క్లిక్‌మనిపించడం కామనే. ఇప్పుడంటే సోషల్ మీడియా వాడకం బాగా పెరగడంతో అందరూ తెగ వాడేస్తున్నారు. ఎప్పుడు జరిగిన ఈవెంట్లను అప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. కానీ గతంలో మెగా హీరోల రేర్ ఫోటోస్, అప్పుడు ఎలా ఉండేవారో చాలా మందికి తెలీదు.

మధ్య మధ్యలో..
మెగా హీరోలంతా దాదాపు ఒకే చోట పెరిగారు. ఏ ఒక్కరి ఫోటో చూసినా కనీసం ఇద్దరు ముగ్గురు హీరోలు ఉంటారు. చిన్నప్పటి నుంచి మెగా ఇంట్లో అదే అలవాటు. అందుకే హీరోల బర్త్ డే సమయాల్లో చిన్నపటి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ మధ్య చిరంజీవి బర్త్ డే సందర్భంగా మెగా హీరోల చిన్న నాటి ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.

వరుణ్ తేజ్ మొదలుపెట్టాడు..
ఇక మెగా హీరోలు చిన్నతనంలో ఎలా ఉండేవారో అప్పుడప్పుడు ఫోటోల ద్వారా చూసేవారు. అందులో మరీ ముఖ్యంగా అల్లు శిరీష్, వరుణ్, సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీకి రాకముందు లావుగా వెరైటీగా ఉండేవారు. తాజాగా వరుణ్ తేజ్ ఓ ఫోటోను షేర్ చేసి సాయి ధరమ్ తేజ్‌ను ఏడిపించాడు. చిన్నప్పటి ఫోటోను షేర్ చేస్తూ.. నీ హెయిర్ స్టైల్ బాగుంది అంటూ సుప్రీం హీరోకు వరుణ్ కౌంటర్ వేశాడు.

రివర్స్ కౌంటర్..
ఇక వరుణ్ తేజ్ వేసిన కౌంటర్‌కు దిమ్మ తిరిగే రివర్స్ కౌంటర్ ఇవ్వాలని సాయి ధరమ్ తేజ్ బాగా వెతికినట్టున్నాడు. ఇంట్లో పరిశోధన చేసి ఆల్బమ్స్ అన్నీ వెతికి వరుణ్ తేజ్ పాత ఫోటో ఒకటి షేర్ చేశాడు. నీ గడ్డం భలే ఉంది అంటూ వరుణ్ తేజ్‌ను ఆటపట్టించాడు. ఇలా మొత్తానికి మెగా హీరోలు ఇండస్ట్రీకి రాకముందు ఎలా ఉండేవారు చెబుతూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు పరువు తీసుకుంటున్నారో మాత్రం తెలియడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











