twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sai Dharam Tej నడిపిన బైక్ కంపెనీ పేరు ఏంది? దాని ధర ఎంతంటే?

    |

    టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో సినీ అభిమానులు, తారలను తీవ్రంగా కలిచివేసింది. సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్ ప్రాంతంలోని ఐకియా స్టోర్ దాటిన తర్వాత జరిగిన బైక్ యాక్సిడెంట్‌ ఘటనలో సాయిధరమ్ తేజ్‌కు బలమైన గాయాలు తగిలాయి. ప్రస్తుతం ఆయన అపోలో హాస్పిటల్‌లో క్రిటికల్ కేర్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ విషాద ఘటన నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ వాడిన బైక్ ఏంటి? దాని ఖరీదు ఎంత? దాని సామర్థ్యం ఎంత? యాక్సిడెంట్ అయితే తట్టుకొనే సామర్ధ్యం ఉందా అనే విషయాలపై చర్చ జరుగుతున్నది. ఈ బైక్ వివరాల్లోకి వెళితే...

    సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా ట్రింప్ బైక్ షోరూం

    సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా ట్రింప్ బైక్ షోరూం

    సాయిధరమ్ తేజ్ ఉపయోగించిన బైక్ పేరు ట్రింప్ ట్రైడెంట్ 660 మోడల్. ఇది బ్రిటన్ ప్రీమియమ్ మోటర్ సైకిల్ బ్రాండ్. ఇటీవలే హైదరాబాద్‌లో ట్రింప్ ట్రైడెంట్ 660 మోడల్ షోరూంను సాయిధరమ్ తేజ్ స్వయంగా ప్రారంభించి బైక్‌ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఓపెనింగ్ చేసిన షోరూం ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. మైలేజ్ విషయానికి వస్తే.. 17.47 కిలోమీటర్లు ఇస్తుంది. ఎమిషన్ టైప్ బీఎస్6, కెర్బ్ వెయిట్ 189 కేజీలు, ఏబీఎస్ డ్యూయల్ ఛానెల్ అని కంపెనీ పేర్కొన్నది.

    ట్రింప్ బైక్ ప్రత్యేకతలు

    ట్రింప్ బైక్ ప్రత్యేకతలు

    ట్రింప్ ట్రైడెంట్ 660 మోడల్ బైక్ విషయానికి వస్తే.. ట్రిపుల్ సిలండర్ 660 సీసీ ఇంజిన్ ఉంది. పీక్ పవర్ 81ps10250 rpm, 64Nm6250సీసీ ఇంజిన్‌తో కూడిన టోర్క్ ఉంది అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. యూత్‌ను విశేషంగా ఈ బైక్ ఆకర్షిస్తున్నట్టు బైక్ అమ్మకాలను బట్టి వెల్లడైంది.

    ట్రింప్ బైక్ షోరూం విశేషత ఏమిటంటే..

    ట్రింప్ బైక్ షోరూం విశేషత ఏమిటంటే..

    ట్రింప్ ట్రైడెంట్ 660 మోడల్ బైక్‌కు ప్రత్యేకమైన విశేషాలను కలిగి ఉంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా, రోడ్లపైనా అలాగే వానాకాలం కూడా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రయాణించవచ్చని కంపెనీ స్పెసిఫికేషన్‌లో స్పష్టంగా తెలియచేశారు. ఈ బైక్‌కు రెండు రకాల రైడ్ మోడ్స్ ఉన్నాయి. పొడి నేల, వర్షాకాలంలో బరద సమయంలో ఎలాంటి సమస్యలు లేకుండా వెళ్లే సామర్థ్యంతో బైక్ రూపొందించారు.

    ట్రింప్ బైక్స్‌లో రకాలు

    ట్రింప్ బైక్స్‌లో రకాలు

    ట్రింప్ ట్రైడెంట్ ఇంకా పలు రకాల బైక్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ బైక్ ఖరీదు 15 లక్షలు, బొన్నెవెల్లే 700 ఖరీదు 5.50 లక్షలు, బొన్నెవెల్లె 350 ఖరీదు 1.98 లక్షలు, డేటోనా 765 బైక్ ఖరీదు 10.50 లక్షలు, టైగర్ మోడల్ బైక్ ధర 17 లక్షలు, బొన్నెవెల్లే స్పీడ్ ట్వీన్ ధర 17 లక్షల రూపాయలు, రాకెట్ 3 మోడల్ ధర రూ.19.95 లక్షలు, స్ట్రీట్ ట్రిపుల్ మోడల్ ధర 9.15 లక్షలు, స్ట్రీట్ ట్విన్ ధర రూ.7.95 లక్షలు అని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.

    ట్రింప్ ట్రైడెంట్ 660 బైక్ ధర

    ట్రింప్ ట్రైడెంట్ 660 బైక్ ధర

    స్పోర్ట్స్ బైక్‌ల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ట్రింప్ ట్రైడెంట్ 660 మోడల్‌కు ఖరీదు కూడా ఘనంగానే ఉంది. సాయిధరమ్ తేజ్ కొనుగోలు చేసిన ఈ బైక్ ఎక్స్‌షోరూం ధర 6.95 లక్షల రూపాయలు. ఇటీవలే ఈ బైక్ షోరూంను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ బైక్‌కు యూత్ నుంచి మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మితీమిరిన వేగంతో బైక్ నడపడం వల్ల సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి లోను కావడంతో ఈ బైక్ గురించి చర్చ జరుగుతున్నది.

    English summary
    Mega Hero Sai Dharam Tej met with accident on Bike triumph Trident at Near to Hitech City. This bike cost and details are..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X