Acharya Teaser అప్డేట్.. చిరు స్టైల్లో సుప్రీమ్ హీరో రిప్లై
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య టీజర్ అప్డేట్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఇంతలా ఆచార్య అప్డేట్ వైరల్ అవ్వడం వెనుక చిరంజీవి మాస్టర్ మైండ్ ఉంది. టీజర్ అప్డేట్ రాబోతోందని ఎవ్వరైనా ప్రకటిస్తారు. కానీ ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా దానికి అనుగుణంగా అప్డేట్‌లు ఇవ్వడం విశేషం. అలా నిన్న సాయంత్రం చిరంజీవి వేసిన ఓ మీమ్ ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. చిరంజీవి తనపై వచ్చే మీమ్, ట్రోల్స్‌లను బాగానే ఫాలో అవుతాడని చెప్పకనే చెప్పేశాడు.
చిరంజీవి లీకులు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తనపై తానే ఓ మీమ్ వేసుకున్నాడు. ఆచార్య టీజర్ అప్డేట్ ఇస్తావా? లీక్ చేసేయాలా? అన్నట్టుగా కొరటాలకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా నిన్న సాయంత్రం ఓ పోస్ట్ చేశాడు.నేడు ఉదయం దెబ్బకు అప్డేట్ వచ్చేసింది. మొత్తానికి టీజర్ జనవరి 29న సాయంత్రం 4 05 గంటలకు రాబోతోందని ప్రకటించేశారు.

అయితే వీటిపై మెగా హీరోలు కూడా మీమ్స్ వేసేస్తున్నారు. టీజర్‌లో చరణ్ అన్న వాయిస్ ఓవర్ ఉంటుందటగా.. బయట టాకు అంటూ వరుణ్ తేజ్ ఓ మీమ్‌ను వేశాడు. ఇక సాయి ధరమ్ తేజ్ అయితే వెయింటింగ్ అంటూ ఖైదీ నంబర్ 150 ఇంటర్వెల్ సీన్ జిఫ్ ఫైల్‌ను షేర్ చేశాడు. ఫ్యామిలీ మొత్తం ఇలా ఉన్నారేంట్రా? అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. మొత్తానికి ఈ మీమ్స్, జిఫ్ ఫైల్స్ బాగానే ట్రెండ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











