ఆ యాడ్ రిజెక్ట్ చేయడం వెనుక అంత కథ ఉందా.. గుట్టు విప్పిన సాయి పల్లవి

సాయి పల్లవిది సహజ సౌందర్యమన్న సంగతి తెలిసిందే. ఈ సమాజంలో నల్లగా ఉన్న వారిని తెల్లగా ఉన్న వారిని వేర్వేరుగా చూస్తుంటారు. అందంగా కనిపించడం, రిచ్‌గా కనిపించడం ఇలా ఎన్నో రకాలుగా మనుషులను వేరు చూసి చూస్తుంటారు. కట్టుబొట్టూ చూసి కామెంట్ చేస్తుంటారు. ఇదే విషయంలోపై సాయి పల్లవి తాజాగా స్పందించింది. సమాజంలో అందం, శరీరఛాయ ఆధారంగా చేసుకుని మనుషులను చులకనగా చూసే స్నేహితులు, బంధువులుంటారని.. అలాంటి వారిని తాను చూశానంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

 సహజంగా కనిపించేందుకు..

సహజంగా కనిపించేందుకు..

సాయి పల్లవి సహజంగా కనిపించేందుకు ఇష్టపడుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన సినిమాల్లోనూ మేకప్ వేసుకునేందుకు అంతగా ఇష్టపడదు. న్యాచురల్‌గా కనిపించేందుకే ఆసక్తి చూపిస్తుంటుంది. జనాలు కూడా సాయి పల్లవిని అలా చూసేందుకే ఇష్ట పడుతుంటారు.

రెండు కోట్ల యాడ్..

రెండు కోట్ల యాడ్..

సహజ సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చే సాయి పల్లవి ఆ మధ్య ఓ భారీ డీల్‌ను రిజెక్ట్ చేసింది. ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్‌ చేయాలంటూ వచ్చిన రెండు కోట్ల ఆఫర్‌ను సాయి పల్లవి తిరస్కరించేసింది. అలాంటి బూటకపు ప్రచారాలు, కృత్రిమ అందాలను తాను ప్రోత్సహించనని చెప్పి రెండు కోట్లను తిప్పి కొట్టేసిందట. అలా చేయడం వెనుక చాలా పెద్ద స్టోరీయే ఉందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

ఎన్నో రకాల క్రీమ్స్‌ వాడాను..

ఎన్నో రకాల క్రీమ్స్‌ వాడాను..

సింపుల్‌గా ఉండడానికే ఎక్కువ ఇష్టపడతాను. ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ప్రకటనకు నో చెప్పడం అనేది పూర్తిగా నా వ్యక్తిగతమైన ఆలోచన. సమాజంలో మనం సృష్టించిన అందం, శరీరఛాయ అనే వాటిని ఆధారంగా చేసుకుని మనుషులను చులకనగా చూసే స్నేహితులు, బంధువులను నేను చూశాను. ముఖ్యంగా నా గురించి చెప్పాలంటే ‘ప్రేమమ్‌'కు ముందు మొటిమలు పొగొట్టుకోడానికి ఎన్నో రకాల క్రీమ్స్‌ వాడాను అంటూ అసలు విషయాన్ని చెప్పేసింది.

బాగా ఆలోచించేదాన్ని..

బాగా ఆలోచించేదాన్ని..

అలా నా మొహాన్ని చూసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లేదాన్ని కాదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఎదుటివారు కేవలం నా మొటిమలను మాత్రమే చూసి ఎందుకు మాట్లాడుతున్నారు.. నా కళ్లలోకి చూసి ఎందుకు మాట్లాడడం లేదు అని తనలో తాను బాగా ఆలోచించేదాన్ని అంటూ సాయి పల్లవి తెలిపింది . ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కానీ ‘ప్రేమమ్‌' తర్వాత ప్రజలు నన్ను నన్నుగానే ఇష్టపడ్డారని సాయి పల్లవి పేర్కొంది.

నా సోదరిలో ప్రేరణ నింపాడానికైనా..

నా సోదరిలో ప్రేరణ నింపాడానికైనా..

దాని వల్ల ఎంతో మంది ప్రేరణ పొందారు ముఖ్యంగా టీనేజీ ఆడపిల్లలు.. అది నాలో ధైర్యాన్ని నింపింది. సమాజంలో వాళ్లు ఒంటరి కాదు అని నిరూపించాలనుకున్నా. అంతేకాకుండా తెల్లగా మారడం కోసం నా సోదరి తనకి ఇష్టంలేని ఆహార పదార్థాలను సైతం తినేది. కాబట్టి, నా సోదరిలో ప్రేరణ నింపాడానికైనా నేను నాలానే ఉండాలని నిశ్చయించుకొన్నా. అందుకే ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ప్రకటనకు నో చెప్పాను అంటూ అసలు విషయాన్ని సాయి పల్లవి బయట పెట్టేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X