బస్టాండ్‌లో సాయి పల్లవి వెయింటింగ్.. చుట్టూ జనం కానీ ఎవ్వరు గుర్తుపట్టలేదు.. షాకింగ్!
Recommended Video
ఎంత సెలెబ్రిటీ అయినా ఓ సాధారణ వ్యక్తిలా తయారై పక్కన కూర్చుంటే ఎవ్వరు మాత్రం గుర్తు పడతారు చెప్పండి. తాజాగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి విషయంలో అదే జరిగింది. అసలే నాచురల్ బ్యూటీ పైగా అత్యంత సాధారణమైన మనిషిలా బస్టాండ్‌లో కూర్చోవడంతో ఆమెను ఎవ్వరు గుర్తుపట్టలేక పోయారు. ఈ షాకింగ్ సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.

షూటింగ్ నిమిత్తం వరంగల్‌లో
వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్ నిమిత్తం వరంగల్ వెళ్ళింది చిత్రయూనిట్. అక్కడ బస్టాండ్ లో ఓ సీన్ షూట్ సందర్బంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. లంగా, ఓణీ వేసుకున్న సాయి పల్లవి.. ఓ సాధారణ ప్రయాణికురాలిగా బస్టాండ్‌లో కూర్చొని బస్ రాగానే వెళ్లిపోయింది.
ఎవ్వరికీ తేలియాకుండా బిల్డింగ్ నుంచి
అక్కడికి సాయి పల్లవి చాలా సాధారణంగా రావడంతో మొదట ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు. ఈ సన్నివేశాన్ని ఎవ్వరికీ తేలియాకుండా ఎదురుగా ఉన్న బిల్డింగ్ నుంచి చిత్రీకరించడం జరిగింది. దీంతో ఆమె సాయి పల్లవి అని, అక్కడ షూటింగ్ జరుగుతోందని ఎవ్వరికీ నార్త్ కాలేదు.

ఒక వ్యక్తి గుర్తించి షార్ట్ వీడియో
అయితే ఎవరో ఒక వ్యక్తి మాత్రం సాయి పల్లవిని గుర్తించి షార్ట్ వీడియో తీశాడు. ఇంతలో సాయి పల్లవి షూటింగ్ పూర్తి చేసుకొని సొంత వాహనంలో కాళేశ్వరం వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ షార్ట్ వీడియో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రానా జోడీగా 'విరాట పర్వం' సినిమాలో, అదేవిధంగా నాగచైతన్య జోడీగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో నటిస్తోంది సాయి పల్లవి.


Click it and Unblock the Notifications











