For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్‌పై మనసు పారేసుకున్న అమ్మాయి: ఎప్పటికైనా ఆ కోరిక తీరాలంటూ కామెంట్

  |

  బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఏ ఒక్క విభాగానికో పరిమితం కాకుండా ప్రతి దానిలోనూ అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. గత ఏడాది ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న బన్నీ.. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ అందమైన అమ్మాయి స్టైలిష్ స్టార్‌పై మనసు పారేసుకుంది. ఆ వివరాలు మీకోసం!

  గ్యాప్ తీసుకున్నా... ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

  గ్యాప్ తీసుకున్నా... ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

  ‘నా పేరు సూర్య' తర్వాత చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్. ఆలస్యం అయినప్పటికీ.. గత ఏడాది సంక్రాంతికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అల.. వైకుంఠపురములో'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడతను. ఈ భారీ మూవీ అద్భుతమైన స్పందనతో హిట్ టాక్‌ను అందుకోవడంతో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఫలితంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

  పాన్ ఇండియా మూవీ చేస్తున్న స్టైలిష్ స్టార్

  పాన్ ఇండియా మూవీ చేస్తున్న స్టైలిష్ స్టార్

  ‘అల' హిట్ తర్వాత మాంచి జోష్ మీద ఉన్నాడు అల్లు అర్జున్. ఈ ఉత్సాహంతోనే గతంలో తనతో ‘ఆర్య', ‘ఆర్య2' వంటి చిత్రాలను తెరకెక్కించిన సుకుమార్‌తో ప్రస్తుతం ‘పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందనుంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది.

  మరో సినిమానూ ప్రకటించిన అల్లు అర్జున్

  మరో సినిమానూ ప్రకటించిన అల్లు అర్జున్

  ‘పుష్ప' మూవీ పట్టాలపై ఉండగానే అల్లు అర్జున్.. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. యువసుధ బ్యానర్, GA2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందనుంది. 2021 ద్వితియార్థంలో ఇది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇక, 2022లో ఈ మూవీ రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

  బన్నీపై మనసు పారేసుకున్న అమ్మాయి

  బన్నీపై మనసు పారేసుకున్న అమ్మాయి

  వరుస సినిమాలతో దూసుకుపోతోన్న బన్నీకి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు, సినీ ప్రముఖులు అతడిని ప్రశంసించారు. అంతేకాదు, తమ అభిమాన హీరో అతడేనంటూ కొనియాడారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్‌కు చెందిన కొత్త అమ్మాయి సయీ మంజ్రేకర్.. అల్లు అర్జున్‌పై మనసు పారేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది.

  ఎప్పటికైనా ఆ కోరిక తీరాలంటూ కామెంట్

  ఎప్పటికైనా ఆ కోరిక తీరాలంటూ కామెంట్

  తాజాగా ఓ నేషనల్ ఛానెల్‌తో చిట్ చాట్ చేసిన సయీ మంజ్రేకర్.. టాలీవుడ్‌లో తనకు నచ్చిన హీరో అల్లు అర్జున్ అంటూ వెల్లడించింది. అంతేకాదు, ఎప్పటికైనా అతడితో కలిసి నటించాలన్న కోరికను ఈ సందర్భంగా బయట పెట్టింది. అంతేకాదు, అతడి డ్యాన్స్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన ఈ బ్యూటీ.. స్టైలిష్ స్టార్‌తో కాలు కదపాలని ఉందని కూడా చెప్పుకొచ్చింది.

  ఇద్దరు అయ్యారు... అల్లు అర్జున్‌తో కూడా

  ఇద్దరు అయ్యారు... అల్లు అర్జున్‌తో కూడా

  సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్ 3' సహా పలు హిందీ చిత్రాల్లో నటించిన సయీ మంజ్రేకర్.. విలక్షణ నటుడు అడవి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్' ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. దీనితో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రం ‘గని'లోనూ నటిస్తోంది. అలాగే, బన్నీ - కొరటాల సినిమాకూ సంతకం చేసినట్లు ఆ మధ్య ఓ న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే.

  English summary
  Director Koratala Siva and actor Allu Arjun are joining hands for a new Telugu film, which they plan to release early 2022. Said to be a pan-Indian project, it will be jointly produced by the director’s friend Mikkilineni Sudhakar and the actor’s friends Sandy, Swathi, and Natti.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X