MS Dhoni పెళ్లికి ముందు ధోనితో అలా రొమాన్స్.. LGM ఈవెంట్‌లో సాక్షి ధోని ఆసక్తికరమైన విషయాలు!
నేను క్రియేటివ్ సైడ్ ఎక్కువగా చొరవ తీసుకొన్నాను. LGM (Lets get Married) మూవీ సొంత భావాలు ఉన్న అమ్మాయి కథ. కొంత తల పొగరు ఉన్న క్యారెక్టర్. ప్రతీ ఆధునిక యువతికి జీవితం పట్ల ఉండే ప్రశ్నలే ఆమెకు ఉంటాయి. పెళ్లికి ముందు తల్లిదండ్రులను వదిలేసి.. అత్తారింటికి వెళ్లడమనే విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది. పెళ్లి తర్వాత అత్తారింటిలో భర్త తప్ప ఎవరూ తెలిసిన వారు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయి ఏం చేశారనేది ఈ సినిమా కథ అని సాక్షి ధోని వెల్లడించారు.
బంధాలు, అనురాగాల మధ్య సాగే కథ LGM (Lets get Married). తల్లి కొడుకు, ప్రియురాలు, ప్రియుడు, కాబోయే అత్త, కాబోయే కోడలు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా. అందర్నీ ఆకట్టుకొంటుందనే ఫీలింగ్ ఉంది. ఇవానా, హరీష్ శంకర్, నదియా చక్కగా నటించారు అని సాక్షి ధోని చెప్పారు.

మా పెళ్లికి ముందు ధోని, నేను కలిసి తిరుగుతుండే వాళ్లు. కానీ మా మధ్య రొమాన్స్ జరగలేదు. అది మా ఇద్దరి బంధానికి మంచి జరిగింది.పెళ్లికి ముందు రొమాన్స్ జరగలేదు కాబట్టి.. మా మధ్య ఎక్కువగా మనసులోని భావాలను ఇచ్చి పుచ్చుకొనే వాళ్లం. అది మా మధ్య కెమిస్ట్రీ అని సాక్షి ధోని తెలిపారు.
ఫస్ట్ టైమ్ నేను ప్రొడక్షన్‌లోకి వచ్చాను. ప్రీ ప్రొడక్షన్ చాలా కష్టమైన పని. షూటింగ్ చాలా ఈజీ. పోస్టు ప్రొడక్షన్ కూడా తేలికే. ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా కష్టం ఎందుకంటే.. ప్లానింగ్, బడ్జెట్ అనేది చాలా కీలకం. ప్రతీ రోజు కొత్తగా నేర్చుకొనే అవకాశం కలిగింది అని సాక్షి ధోని చెప్పారు.

LGM (Lets get Married) మూవీ నాకు తొలి ప్రాజెక్టు. మా టీమ్ చక్కగా పనిచేసింది. వారి నుంచి చాలా నేర్చుకొన్నాను. అవన్నీ నేను ప్రస్తుతం షేర్ చేసుకోలేం. కానీ తొలి సినిమా నుంచి మంచి అనుభవాన్ని నేర్చుకొన్నాను. సినిమా రంగంలోకి రావాలన్న నిర్ణయం నేను, ధోని కలిసి తీసుకొన్నాం అని సాక్షి ధోని చెప్పారు.


Click it and Unblock the Notifications











