Don't Miss!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్‌ను కూడా
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్‌తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్‌లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్.. సూర్యపై సమంత ప్రశంసలు
ఈ ఏడాది ఓటీటీలో వచ్చిన సినిమాల్లో సూరారై పొట్రూ (ఆకాశం నీ హద్దురా) మాత్రమే మంచి పేరు తెచ్చుకుంది. సూర్య నటనకు నిదర్శనంగా మారిన ఆకాశం నీ హద్దురా సినిమాపై సెలెబ్రిటీలు కూడా ప్రశసంలు కురిపించారు. సాధారణ జనాల నుంచి సెలెబ్రిటీల వరకు కూడా సూర్య నటన, సుధా కొంగర దర్శకత్వ ప్రతిభను, అద్భుతంగా తెరకెక్కించిన తీరకు అందరూ ఫిదా అయ్యారు. ఓటీటీలో మొదటి సక్సెస్ కొట్టిన చిత్రంగా ఆకాశం నీ హద్దురా నిలిచింది.
వ్యూస్ పరంగానూ ఆకాశం నీ హద్దురా సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధిక మంది వీక్షించిన చిత్రంగా ఆకాశం నీ హద్దురా రికార్డులు క్రియేట్ చేసింది. అలాంటి చిత్రంపై టాలీవుడ్, కోలీవుడ్ టాప్ సెలెబ్రిటీలందరూ ప్రశంసలు కురిపించారు. చాలా రోజులు తరువాత మళ్లీ మునుపటి సూర్యను చూశామని కామెంట్స్ చేశారు. తాజాగా సమంత సైతం అవే వ్యాఖ్యలు చేసింది.
తాజాగా స్పందిస్తూ.. సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాపూ కామెంట్ చేసింది. ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అంటూ కొనియాడేసింది. సూర్య ఓ జెమ్ అంటూ చేతులెత్తి మొక్కేసింది. సుధా కొందర అదరగొట్టేసిందని, అపర్ణా బాలమురళీ అద్భుతంగా నటించిందని చెప్పుకొచ్చింది. సినిమా అవుట్ స్టాండింగ్.. స్ఫూర్తిని రగిలేలా చేసే చిత్రమని చెప్పుకొచ్చింది. కెప్టెన్ గోపీనాథ్ కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాను సుధా కొంగర అద్భుతంగా తెరకెక్కించింది.