సిట్యువేషన్‌ను క్యాచ్ చేసింది.. బిజినెస్ ప్రమోషన్ మొదలెట్టిన సమంత!!
ప్రస్తుతం దేశమంతా విద్యా వ్యవస్థపై గందరగోళం నెలకొంది. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తోన్నాయి. అయితే భారత్ వంటి దేశాల్లో ఆ విధానం అమలు పర్చడం అంత సులభం కాదని సర్వేలు చెబుతున్నాయి. అయితే ప్రైవేట్ స్కూల్, కాలేజీల యాజమాన్యాలు ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇక సమంత కూడా తన స్కూల్‌ను ప్రమోట్ చేసుకునే పనిలో పడింది.
మన సెలెబ్రిటీల్లో విద్యా వ్యవస్థలో బిజినెస్ చేస్తోంది ఎవరంటే మంచు ఫ్యామిలీ అనే ఇట్టే చెబుతారు ఎవరైనా. అటు మంచు వారి విద్యానికేతన్ ఉండగా.. మంచు విష్ణు ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో ఓ స్కూల్ రన్ చేస్తున్నారు. ఇక వీరి స్ఫూర్తితోనే అన్నట్టుగా సమంత కూడా దిగింది. ఏకమ్ అనే పేరుతో చిన్న పిల్లల స్కూల్‌ను ప్రారంభించింది. ఇప్పుడు తెలంగాణలో స్కూల్స్ ప్రారంభించేందుకు రంగం సిద్దమవుతుండగా సమంత కూడా తన స్కూల్ ప్రమోషన్స్‌లో బిజీ అయింది.

ఏకం వర్చువల్ స్కూల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది.మన పిల్లల్లో వర్చువల్ స్కూల్, పాఠాల వల్ల నేర్చుకోవాలనే తపన పెరుగుతుందని నమ్ముతున్నాం. చదువుతో పాటు ఇతర వినోద కార్యక్రమాలు, ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ కూడా ఉంటాయని చెప్పుకొచ్చింది. పరిమిత సంఖ్యలో సీట్స్ ఉంటాయి కాబట్టి తొందరగా ఎన్‌రోల్ చేయించుకోండి. మిగతా వివరాల కోసం మా వెబ్‌సైట్‌ను చూడండి అంటూ సమంత షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











