Don't Miss!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ఆ ఫోటోలు బయటపెట్టేందుకు అనుమతిచ్చేశాడట.. చైతన్యపై సమంత కామెంట్స్
సమంత, నాగ చైతన్యల ప్రేమ కథ, పెళ్లి గురించి అందరికీ తెలిసిందే. అయితే సమంత సోషల్ మీడియాలో ఎంత అల్లరి చేస్తుంటుందో.. నాగ చైతన్య అంతకు విరుద్దంగా ఉంటాడు. సోషల్ మీడియాలో సమంత ప్రతీదీ షేర్ చేస్తుండటంపై ఆ మధ్య నాగ చైతన్య చురకలు అంటించిన సంగతి తెలిసిందే. ఆహాలో సామ్ జామ్ షోకు నాగ చైతన్య గెస్ట్‌గా వచ్చినప్పుడు సమంతను ఓ ఆట ఆడుకున్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియాకు దూరం..
నాగ చైతన్య సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు.అవసరం అయితే తప్పా పోస్ట్‌లు చేయడు. కేవలం పండుగలకు, తన సినిమాలకు సంబంధించిన పోస్ట్‌లు చేస్తుంటాడు. అంతే తప్పా పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఫోటోలు, పోస్ట్‌లు చేయడు.
కానీ సమంత ఇలా..
సోషల్ మీడియాకు నాగ చైతన్య ఆమడ దూరంలో ఉంటే.. సమంత మాత్రం అదే లోకంగా ఉంటుంది. రోజుకూ పదుల పోస్ట్‌లు చేస్తూనే ఉంటుంది. ప్రతీది సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. సమంత చేసే ప్రతీ పోస్ట్‌లో తన హష్ ఉంటాడు.. కానీ నాగ చైతన్య మాత్రం అప్పుడప్పుడు కూడా సమంత పోస్ట్‌లో కనిపించడు.
దూరంగా ఉంటాడు..
తాను పోస్ట్ చేసే ఫోటోల్లో నాగ చైతన్య ఎందుకు ఉండడో అతన్నే అడిగి తెలుసుకుందాం అంటూ సమంత సామ్ జామ్ షోలో అసలు విషయం బయటకు వచ్చేలా చేసింది. తన పర్సనల్ లైఫ్‌ను అందరి ముందు ఉంచడం తనకు ఇష్టముండదని చైతన్య చెప్పుకొచ్చాడు.
తాజాగా అలా..
ప్రేమికుల రోజున ఈ ప్రేమ జంట చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఆ ప్రైవేట్ ఫోటోలు మాత్రం అంతగా బయటకు రావు. నాగ చైతన్య రానీవ్వడు. కానీ సమంత మాత్రం కొన్నింటిని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా నిన్నటి వాలెంటైన్స్ డే గురించి సమంత చెబుతూ ఓ కామెంట్ చేసింది.
కొన్నింటికి అనుమతి..
చైతన్య ఫోటోలను ఎక్కువ పోస్ట్ చేయండి అని అడిగేవారికి చెబుతున్నా.. ఇప్పుడు కొన్నింటికి అనుమతి వచ్చింది.. ఇక మళ్లీ క్రిస్టమస్‌కు షేర్ చేస్తాను.. పైగా బర్త్ డే, పెళ్లి రోజులకు ఇంకా అనుమతులు పెండింగ్‌లోనే ఉన్నాయంటూ చైతన్యపై సరదాగా కామెంట్ చేసింది సమంత.