twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలసిపోయి వచ్చి బెడ్‌ మీద పడుకుంటే!.. సమంత రచ్చ మామూలుగా లేదు

    |

    ప్రస్తుతం సమంతకు ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ తన కంటూ ఓ ముద్రను వేసుకుంది. ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రాలకు, పాత్రలకే ఓటు వేస్తోంది. అలాంటి సమంత బుల్లితెరపై మాత్రం విచ్చలవిడిగా ప్రకటనల్లో నటిస్తోంది. అయితే ఈ క్రమంలో లాక్డౌన్ కాలంలో ఇంట్లోనే ఉంటూ కొన్ని యాడ్స్‌లో నటించేసింది. మరీ ముఖ్యంగా నాగ చైతన్య, సమంత కలిసి చేసే ప్రకటనల పట్ల అందరూ ఆకర్షితులవుతుంటారు.

    కొత్త రకమైన యాడ్స్..

    కొత్త రకమైన యాడ్స్..

    ఈ మధ్య ప్రకటనల్లోనూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. హీరోల ఫ్యామిలీలను కూడా యాడ్స్‌లో భాగం చేసేస్తున్నారు. సెలెబ్రిటీల జంటలు, వారి ఫ్యామిలీలతో వెరైటీ కాన్సెప్ట్‌లతో యాడ్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే నాగ చైతన్య సమంతలను కలిపి ఒకే యాడ్‌లలో నటింపజేస్తున్నారు.

    అలా ఫుల్ బిజీగా..

    అలా ఫుల్ బిజీగా..

    నాగ చైతన్య సపరేట్‌గా యాడ్స్‌లో నటిస్తుంటాడు.. సమంత కూడా తనకు నచ్చిన మెచ్చిన ప్రొడక్ట్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంటుంది. ఈ ఇద్దరూ కలిసి కొన్ని ప్రొడక్ట్‌లను ప్రమోట్ చేస్తుంటారు. అలా ఈ ఇద్దరూ యాడ్స్ ద్వారా బాగానే సంపాదిస్తుంటారు.

    తాజాగా సమంత..

    తాజాగా సమంత..

    తాజాగా సమంత ఓ యాడ్‌లో నటించింది. స్లీప్ వెల్ పరుపుల గురించి చెబుతూ చేసిన యాడ్ బాగానే ఉంది. తమిళంలో వదిలిన ఈ యాడ్‌ను తాజాగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలోషేర్ చేసింది. ఇందులో తమిళంలో డైలాగ్‌లు చెప్పి ఇరగ్గొట్టేసింది.

    బెడ్ మీద పడుకుంటే..

    బెడ్ మీద పడుకుంటే..

    అలా షూటింగ్, ఫోటో షూట్‌లంటూ తిరిగి తిరిగి అలిసిపోయి వచ్చి బెడ్ మీద పడుకుంటే వచ్చే సంతోషమే వేరు అంటూ సమంత చెప్పుకొచ్చింది. గడిచిన ఏడాది కాలంలో మన ఆరోగ్యం, సంరక్షణ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసివచ్చింది. మన జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. అలా నేను ఈ మ్యాట్రిసెస్‌ను మార్చేశాను అంటూ సమంత స్లీప్ వెల్ పరుపుల గురించి చెప్పింది.

    ఇళ్లు, పరుపు..

    ఇళ్లు, పరుపు..

    మన ఇళ్లు.. మన బెడ్... ఇవే మనకు సంతోషాన్ని ఇచ్చే స్థలాలు.. మనం హ్యాపీగా ఉండే ఈ స్థలాలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది.. అందుకే స్లీప్ వెల్‌ను వాడుతున్నాను.. నీమ్ ఫ్రెష్ టెక్నాలజీతో జెర్మ్స్ మన దరికి రాకుండా కాపాడుతుందని సమంత చెప్పుకొచ్చింది. మొత్తానికి యాడ్స్ ద్వారా సమంత ఫుల్లుగా సంపాదిస్తోంది.

    English summary
    samantha akkineni ad for sleepwell mattresses
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X