అయ్యో పాపం.. స్కిన్ ఎలర్జీ వచ్చిందట.. సలహాలు కోరుతున్న సమంత

కొందరి మూగ జీవాలంటే ఎక్కువ మక్కువ ఉంటుంది. ముఖ్యంగా సెలెబ్రిటీల్లో అయితే చాలా మంది పెట్‌ను పెంచుకుంటారు. వారంతా జంతు ప్రేమికులు. ప్రతీ సెలెబ్రిటీ ఇంట్లో ఒక్కో రకమైన జాతికి సంబంధించిన పెట్స్ ఉంటాయి. వారు తమ పెంపుడు కుక్కలను ఫ్యామిలీగా భావిస్తారు. ఇక సమంత తన పెట్స్‌ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అందరికీ తెలిసిందే.

జంటగా ఆడుకుంటారు..

జంటగా ఆడుకుంటారు..

సమంతకు పెట్స్ అంటే ఎంత ఇష్టమో.. నాగచైతన్యకు కూడా అంతే ఇష్టం. ఇద్దరూ జంతు ప్రేమికులే ఇక వీరి ఇంట్లో వివిధ రకాల జాతుల పెట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, బర్త్ డే సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు సమంత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. పెట్స్‌తో తనకున్న బంధాన్ని చెబుతూ కామెంట్స్ కూడా చేస్తుంది.

తాజాగా అలా..

తాజాగా అలా..

తాజాగా సమంత హాట్ లుక్కులో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఉపాసన తాను ప్రారంభించబోయే కొత్త వెబ్ సైట్ ప్రమోషన్స్‌లో భాగంగా సమంతను ఇంటర్వ్యూ చేసినట్టు తెలుస్తోంది. ఆరోగ్య చిట్కాలు, ఆహారం ఇలాంటి వాటిపై అవగాహన కలిగించేందుకు URLife అనే వెబ్ సైట్‌ను లాంచ్ చేయబోతోన్నారు. ఈ వెబ్ సైట్ బాధ్యతలను సమంతపై పెట్టబోతోన్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో సమంత చేసిన ఫోటో షూట్, జిమ్‌లో కూర్చుని ఇచ్చిన పోజు అందర్నీ ఆకట్టుకుంది.

పెట్‌కు ఆరోగ్య సమస్యలు..

పెట్‌కు ఆరోగ్య సమస్యలు..

తన పెట్‌కు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చాయని అన్ని ప్రయత్నాలు చేశానని తెలిపింది. ఓకే ఇక నేను వదిలేస్తున్నా.. పూర్తిగా వదిలేస్తున్నా.. అన్ని రకాలుగా ట్రై చేశాను.. మెడిసిన్స్, ఫుడ్ అన్ని చాలా సార్లు మార్చేశాను.. ఎలర్జీ టెస్ట్‌లు కూడా చేశాను.. అన్నీ చేశాను.. ఇలాంటి వాటిని నయం చేసేందుకు ఎవరైనా ఏదైనా సలహాలు చెప్పండి అని సమంత కోరింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 13 Highlights | బిగ్ బాస్ పనిష్మెంట్ | Filmibeat Telugu
నెటిజన్ల స్పందన..

నెటిజన్ల స్పందన..

తన కుక్కకు కూడా ఇలాంటి సమస్యే వస్తే ఆలీవ్ ఆయిల్, బేకింగ్ సోడా మిశ్రమం వాడానని తెలిపాడు. కిస్కిన్‌ను సంప్రదించండని ఇంకకరు తెలిపారు. హోమియోపతి బెటర్ అని మరొకరు సలహా ఇచ్చారు. హెంప్ సీడ్ ఆయిల్, యాపిల్ సీడ్ వెనిగర్ అంటూ ఇలా సూచనలు ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X