For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాత్‌టబ్‌లో బికినీతో రెచ్చిపోయిన సమంత: తొలిసారి అలా కనిపించడంతో అంతా షాక్!

  |

  సమంత.. తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరిది. 'ఏమాయ చేశావే' అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన ఈ బ్యూటీ.. అద్భుతమైన నటనతో పాటు ఆకట్టుకునే అందంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌ అయిపోయింది. అప్పటి నుంచి తెలుగులో తన హవాను చూపిస్తూనే ఉంది. ప్రస్తుతం భర్త నాగ చైతన్యతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోన్న ఈ భామ.. బాత్‌టబ్‌లో దిగిన బికినీ ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటోపై మీరూ ఓ లుక్కేయండి!

  వరుస విజయాలతో సమంత దూకుడు

  వరుస విజయాలతో సమంత దూకుడు

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో అక్కినేని సమంత ఒకరు. కెరీర్ ఆరంభంలోనే హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆమె.. మధ్యలో కొన్ని ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంది. చాలా కాలంగా ఆమె వరుసగా విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలోనూ హిట్లను అందుకుంటోంది. ఫలితంగా సౌత్‌లోనే హవాను చూపిస్తోంది.

  జాను బ్రేకిచ్చింది.. లాంగ్ బ్రేక్ తీసుకుంది

  జాను బ్రేకిచ్చింది.. లాంగ్ బ్రేక్ తీసుకుంది

  వరుస విజయాలతో దూసుకుపోతోన్న సమంతకు ‘జాను' మూవీ ద్వారా బ్రేక్ పడింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96'కు రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే, ఇందులో హీరో శర్వానంద్‌తో పాటు సామ్ నటన మాత్రం ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత సమంత మరో ప్రాజెక్టును ఓకే చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

   సమంత చేతిలో ఇదొక్కటే.. సరికొత్త రోల్

  సమంత చేతిలో ఇదొక్కటే.. సరికొత్త రోల్

  ప్రస్తుతం సమంత చేతిలో ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. ఎడిటింగ్ వర్క్ జరుపుకుంటోంది. ఇందులో సామ్ టెర్రరిస్టుగా కనిపించబోతుందని ప్రచారం జరుగుతోంది. మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్న దీనిని తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు.

  హోస్ట్‌గా ఎంట్రీ.. అక్కడ స్పెషల్ హోస్ట్‌లా

  హోస్ట్‌గా ఎంట్రీ.. అక్కడ స్పెషల్ హోస్ట్‌లా

  సినిమాలు చేయకున్నా ప్రేక్షకులకు మాత్రం దగ్గరగానే ఉంది సమంత. ప్రస్తుతం ఆమె ఆహా వీడియోస్ రూపొందించిన ‘సామ్ జామ్' అనే షోను హోస్ట్ చేస్తోంది. సినీ ప్రముఖులు పాల్గొనే ఈ చిట్ చాట్ షో ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక, తన మామ నాగార్జున హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్‌కు సైతం సమంత స్పెషల్ హోస్టుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

  బాత్‌టబ్‌లో బికినీతో రెచ్చిపోయిన సామ్

  బాత్‌టబ్‌లో బికినీతో రెచ్చిపోయిన సామ్

  నాగ చైతన్యతో కలిసి తరచూ ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తుంటుంది సమంత. ఇందులో భాగంగానే భర్త పుట్టినరోజు సందర్భంగా అతడితో కలిసి మాల్దీవులు చెక్కేసింది. బర్త్‌డే సెలెబ్రేషన్స్ పూర్తయినా అక్కడే ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే స్కూబా డైవింగ్ సహా ఎన్నో పనులు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బాత్‌టబ్‌లో దిగిన ఓ బికినీ ఫొటోను షేర్ చేసిందీ బ్యూటీ.

  #NC20 : Naga Chaitanya's New Film Thank You Movie Opening | Vikram K Kumar
   తొలిసారి అలా కనిపించడంతో అంతా షాక్!

  తొలిసారి అలా కనిపించడంతో అంతా షాక్!

  అక్కినేని సమంత ఏం చేసినా సంచలనమే అవుతోంది. గతంలో ఎన్నో గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాలో వదిలిన ఆమె.. తాజాగా మాల్దీవుల్లో దిగిన బికినీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకుంది. బాత్‌టబ్‌లో బికినీ వేసుకుని ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తమ అభిమాన హీరోయిన్‌ను అలా చూసి తట్టుకోలేకపోతున్నారు అక్కినేని అభిమానులు.

  English summary
  Directors Raj and DK, who made their digital debut with Amazon Prime’s The Family Man, are enjoying the accolades coming their way. The Manoj Bajpayee, Neeraj Madhav, Priyamani, Sharib Hashmi starrer has received largely good reviews from audience and critics alike.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X