ఏదో భారీ స్కెచ్ వేసినట్టే ఉంది.. బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ గాల్లో తేలిపోతోన్న సమంత
సమంత గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లాక్ డౌన్ సమయంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకుని అందరికీ చాలెంజ్‌లు కూడా విసురుతోంది. ఇంటి టెర్రస్‌పై పండ్డు, కూరగాయలను పండిస్తూ సెలెబ్రిటీలకు గ్రో విత్ మీ అంటూ సవాళ్లను విసురుతోంది. అర్భన్ ఫార్మింగ్‌లో సమంత ఆరి తేరిపోయింది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన వంటలు ఎలా వండాలో కూడా నేర్చుకుంది. ఈ మేరకు సమంత చేసిన పోస్ట్‌లు అప్పట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అలాగే సమంత తాజాగా చేసిన పోస్ట్ ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ..
సమంతకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగే వేరు. దక్షిణాది హీరోయిన్లలో అతి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న వారిలో సమంత ఒకరు. నెటిజన్లతో సమంత ముచ్చటించడం, సెటైర్లు, కౌంటర్లు వేస్తూ అందర్నీఆకట్టుకుంటుంది సమంత. వీలు చిక్కినప్పుడల్లా సమంత తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది.

లాక్ డౌన్‌లో అలా బిజీ..
సమంత ఈ లాక్‌డౌన్ మొత్తాన్ని తన పెట్స్, మొక్కలు, కూరగాయలు, పండ్లు, వంటగది అంటూ ఇంట్లోనే బిజీబిజీగా గడిపింది. పైగా తన పెట్ ఎంతగా విసిగించిందో కూడా చెప్పుకొచ్చింది. కిచెన్‌లో దూరి ఎంతగా అల్లరి చేస్తుందో చెబుతూ సమంత వాపోయింది. ఇక ఈ మధ్యే ఫ్యామిలీమెన్ 2 డబ్బింగ్ కూడా పూర్తి చేసింది. తాజాగా సమంత చేసిన పోస్ట్ మాత్రం అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.

ఇప్పటికి నెరవేరింది..
ఇలాంటిది ఒకటి నిర్మించాలని ఎన్నో యేళ్ల నుంచి కలలు కంటున్నాను.. ఓ అద్భుతమైన టీం దొరకడం జీవితంలో అది నెరవేరింది. ఇది మీకు చెప్పాలని, నాతో పాటు ఉన్నవారికి, నాకు సపోర్ట్ చేస్తున్న వారికి, ఎన్నో యేళ్ల నుంచి ప్రేమను కురిపిస్తున్న వారికి ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఆ సంతోషాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నాను అంటూ సమంత చెప్పుకొచ్చింది.
Recommended Video

ఎంతో ఆత్రుతగా ఉన్నాను..
అదెంతో చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎంతో అద్భుతమైన టీంతో కలిసి పనిచేశాము. గత కొన్ని నెలలుగా అందరం కలిసి పని చేసి దీన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఈ విషయం ఏంటో మీకు చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఉన్నాను అదే సమయంలో నర్వస్‌గా కూడా ఫీల్ అవుతున్నాను. రేపు (సెప్టెంబర్ 5) మధ్యాహ్నం 12 గంటలకు అదేంటో చెబుతాను' అంటూ అందరిలోనూ ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని, ఆసక్తిని కలిగించింది. ఇంతకీ ఆ అనౌన్స్‌మెంట్ దేని గురించి అయి ఉంటుందని అంతా తలలు గోక్కుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











