సమంత కూడా అక్కడికే చెక్కేసింది.. అదిరిపోయే ఫోటోతో రచ్చ
ప్రస్తుతం సెలెబ్రిటీలకు వెకేషన్ అంటే ఒక్కటే స్పాట్ గుర్తుకు వస్తోంది. అందరూ మాల్దీవుల్లోనే సేద తీరుతున్నారు. వరుసబెట్టి మన తారలందరూ అక్కడికే వెళ్తున్నారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన భర్తతొ కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేసి వచ్చింది. శ్రీజ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసేందుకు కళ్యాణ్ దేవ్ స్పెషల్ వెకేషన్ ప్లాన్ చేసినట్టున్నాడు. ఇక తాప్సీ తన సోదరి, ఫ్రెండ్‌తో కలిసి మాల్దీవుల్లోనే ఎంజాయ్ చేసింది.
మరో వైపు కాజల్ తన హనీమూన్‌ను సైతం అక్కడే ప్లాన్ చేసుకుంది. నీళ్లలో, బీచ్‌లో ఇలా ప్రతీ చోటా కాజల్ గౌతమ్ జంటే రచ్చ చేసింది. హనీమూన్ ఫోటోలు షేర్ చేస్తూ కాజల్ పెట్టిన మంట ఇంకా తగ్గడం లేదు. ఇక ప్రస్తుతం రకుల్ చేసే హంగామా జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది. బీచ్‌లో బికినీలు, సముద్రపు ఒడ్డున యోగాసానాలు, ఫ్యామిలీతో కలిసి డిన్నర్లు, స్కూబా డైవింగ్ అంటూ మాల్దీవుల్లో రకుల్ రచ్చ రచ్చ చేస్తోంది.

ప్రస్తుతం సమంత కూడా మాల్దీవులకే చెక్కేసింది. అయితే వెంట నాగచైతన్య కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. మాల్దీవులకు వెళ్తున్నట్టు.. స్వర్గం స్వాగతం చెబుతోందన్నట్టు ఓ క్యాప్షన్ పెట్టి విమాన ప్రయాణం గురించి చెప్పింది. ఇక మాల్దీవుల్లో తన రూం రిసార్ట్ చూపిస్తూ వీడియోను షేర్ చేసింది. వాటితో పాటు ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో సమంత బ్యాక్ నుంచి కనిపిస్తుంది. అదిరిపోయే పోజు ఇచ్చిన సమంత ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











