సమంత ఖాతాలో ఊహించని రికార్డు: ఇండియాలో ఏ హీరోయిన్‌కూ దక్కని ఘనత సొంతం

చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది అక్కినేని వారి కోడలు సమంత. అద్భుతమైన నటన.. ఆకట్టుకునే అందంతో మైమరపించే ఈ బ్యూటీ.. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని హవాను చూపించింది. ఇన్ని రోజులూ వెండితెరను ఏలిన ఈ హాట్ బ్యూటీ.. డిజిటల్ వరల్డ్‌లోకీ అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇండియాలో ఏ హీరోయిన్‌కూ దక్కని ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంది సామ్. వివరాల్లోకి వెళ్తే...

Recommended Video

Samantha Akkineni Gets Twitter Emoji For Family Man Season 2 | Filmibeat Telugu

ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి.. సురభి పిక్స్ వైరల్

రెండు భాషల్లోనూ సత్తా.. వరుస విజయాలు

రెండు భాషల్లోనూ సత్తా.. వరుస విజయాలు

కొన్నేళ్లుగా తెలుగుతో పాటు తమిళంలో వరుసగా విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది సమంత. కెరీర్‌కు పెళ్లి అనే బంధం ఏమాత్రం అడ్డు కాదని నిరూపిస్తూ వివాహం తర్వాత కూడా సినిమాల మీద సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తెలుగులో వరుసగా బోలెడు విజయాలను అందుకుని సత్తా చాటింది. అదే సమయంలో తమిళంలోనూ హిట్లను అందుకుంటూ దూసుకెళ్తోంది.

విజయ పరంపరకు అలా బ్రేక్ పడిపోయింది

విజయ పరంపరకు అలా బ్రేక్ పడిపోయింది


త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అఆ' నుంచి ఎన్నో విజయాలను అందుకున్న సమంతకు గత ఏడాది 'జాను' అనే సినిమా రూపంలో ఓ భారీ ఫ్లాప్ ఎదురైంది. తమిళంలో సూపర్ హిట్ అయిన '96'కు రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. ఫలితంగా సామ్ విజయాల పరంపరకు బ్రేక్ పడిపోయింది. ఇందులో శర్వానంద్ హీరోగా నటించగా దిల్ రాజు నిర్మించాడు.

దేశం మొత్తం గర్వించే పాత్రలో నటించనుంది

దేశం మొత్తం గర్వించే పాత్రలో నటించనుంది

'జాను' తర్వాత సమంత మరో సినిమాను ప్రకటించలేదు. కానీ, ఇటీవల గుణశేఖర్‌ రూపొందించనున్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా ప్రాజెక్టులో ఆమె నటిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో ఈ చిత్ర బృందం బిజీగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కనున్న ఈ రొమాంటిక డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఆ ప్రపంచంలోకి ఎంట్రీ... ఊహించని పాత్రలో

ఆ ప్రపంచంలోకి ఎంట్రీ... ఊహించని పాత్రలో

టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది. ఇందులో ఆమె టెర్రరిస్టు పాత్రలో నటిస్తోంది. ఫిబ్రవరి నుంచి ఇది స్ట్రీమ్ కాబోతుంది. మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్‌ను.. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

రియల్ స్టంట్స్‌తో ఆశ్చర్య పరిచిన సమంత

రియల్ స్టంట్స్‌తో ఆశ్చర్య పరిచిన సమంత

అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్‌గా పేరొందింది 'ద ఫ్యామిలీ మ్యాన్'. దానికి కొనసాగింపుగా వస్తోన్న దానిలో సమంత స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఈ సిరీస్ కోసం ఆమె ఎన్నో సాహసాలు చేసిందట. మరీ ముఖ్యంగా ఇందులో సామ్ వెపన్స్‌తో కనిపిస్తుందట. అలాగే, గన్స్, గ్రానైట్స్ ఇలా ఎన్నో రకాల ఆయుధాలతో ఇప్పటి వరకూ చేయని స్టంట్స్ చేసిందని అంటున్నారు.

సమంత ఖాతాలో ఊహించని రికార్డు చేరింది

సమంత ఖాతాలో ఊహించని రికార్డు చేరింది

కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' హవా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఇండియా ఈ సిరీస్‌ కోసం ఓ ఎమోజీని స్పెషల్‌గా విడుదల చేసింది. ఇందులో హీరో మనోజ్‌ భాజ్‌పేయ్‌తో పాటు సమంతను కూడా ఉంచారు. ఇలా ఇండియాలోని ఏ హీరోయిన్‌కు కూడా ఇప్పటి వరకు ఎమోజీ రాలేదు. దీంతో సమంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసకున్నట్లైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X