నీ మొగుడు ఆ టైపేనా? గంగవ్వ ప్రశ్నలకు బెదిరిపోయిన సమంత!

Recommended Video

Gangavva Hilarious Interview With Samantha | Samantha Akkineni Vs Gangavva || Filmibeat Telugu

'ఓ బేబీ' సినిమా ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి...యూట్యూబ్ స్టార్(మై విలేజ్ షో ఫేం) గంగవ్వకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా గంగవ్వ ఎవరూ ఊహించని, సాధారణంగా మీడియా వారు సమంతను అడగటానికి భయపడే ప్రశ్నలను నిర్మొహమాటంగా అడిగేయటం నవ్వులు పూయించింది.

ఇంటర్వ్యూ అనంతరం సమంతకు పలు రకాల పరీక్షలు పెట్టిన గంగవ్వ... ఈ స్టార్ హీరోయిన్‌తో ఉల్లిపాయలు తరిగించడం, చపాతీలు చేయించడం, పప్పు దినుసులను గుర్తించాలంటూ టెస్ట్ పెట్టడం ఆసక్తిని రేకెత్తించింది. యూట్యూబ్‌లో గంగవ్వకు సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

వేరే వాళ్లు తాళి కడితే మీ మొగుడు ఏమీ అనడా?

వేరే వాళ్లు తాళి కడితే మీ మొగుడు ఏమీ అనడా?

‘‘మీరు ఏమీ అనుకోనంటే ఓ ప్రశ్న అడుగుతా మేడం. సినిమాల్లో మీకు వేరే వ్యక్తులు తాళి కడతారు... మరి మీ మొగుడు ఏమీ అనరా?'' అంటూ గంగవ్వ అమాయకంగా అడిగిన ప్రశ్నకు సమంత రియాక్ట్ అవుతూ... ‘‘సినిమాలో రెండు ముళ్లు మాత్రమే వేస్తారు, మూడో ముడి వేయరు. అలా వేసినట్లు చూపిస్తారంతే..'' అని తెలిపారు.

సమంత నలుగురు పిల్లలను కనాలి

సమంత నలుగురు పిల్లలను కనాలి

సమంత మేడమ్.. మీరు నలుగురు పిల్లలను కంటే బావుంటుందని గంగవ్వ కోరగా... ‘‘నా వల్ల కాదు. అలా అయితే నేను సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుని పిల్లలను కనే పని మీదే ఉండాలి. నలుగురు పిల్లలు అంటే చాలా సమయం పడుతుంది, పైగా చాలా కష్టం'' అని సమంత వ్యాఖ్యానించారు.

నందినీ మేడమ్ ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకుంటారు?

నందినీ మేడమ్ ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకుంటారు?

దర్శకురాలు నందినీ రెడ్డిని ఉద్దేశించి గంగవ్వ మాట్లాతూ... ‘ఎప్పుడూ ఇలా ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు... చీర కట్టుకోరు ఎందుకు? అని ప్రశ్నించగా ‘నాకు చీర కట్టుకుని పని చేయడం రాదు. అందుకే ఇట్ల ప్యాంట్ షర్ట్ వేసుకుంటా. చీర కట్టుకుంటే ఆగమాగం అయితా. కంఫర్టుగా ఉండటం కోసమే ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటాను' అని నందినీ రెడ్డి తెలిపారు.

మీ మొగుడిని ఎంత పెట్టి కొన్నారు?

మీ మొగుడిని ఎంత పెట్టి కొన్నారు?

మీ మొగుడిని ఎంత(కట్నం) పెట్టి కొనుక్కున్నారు అని గంగవ్వ అడిగిన ప్రశ్నకు సమంత ఆశ్చర్యపోయారు. చాలా డబ్బులు పెట్టి కొన్నాను. ఎంత అనే విషయం నీ చెవిలో మాత్రమే చెబుతాను, అందరికీ తెలిసేలా చెబితే ప్రాబ్లం వస్తుందని వ్యాఖ్యానించారు.

నీ మొగుడు ఆ టైపేనా?

నీ మొగుడు ఆ టైపేనా?

ట్రైలర్లో ఓ సీన్లో ‘మొగుడు అంటే చూడటానికి అందంగా ఉండాలి, నేను ఏం కొనుక్కోవాలన్నా ఆడి దగ్గర సరిపడా డబ్బులు ఉండాలి, మంచం ఎక్కితే మగాడిలా కాపురం చేయాలి' అనే సీన్ ఉద్దేశించి ‘మీ మొగుడు కూడా అలాగే ఉన్నారా?' అంటూ గంగవ్వ ప్రశ్నించడంతో సమంత బెంబేలెత్తిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X